Ak 47 used in aurobindo pharma vice chariman nityananda reddy firing was the one which lost last year doubts police

nityananda reddy, firing, KBR park, Aurobindo Pharma vice president, AK 47, Assailant, CP Mahendar reddy

Ak 47 used in aurobindo pharma vice chariman nityananda reddy Firing was the one which lost last year doubts police

గతేడాది పోయింది.. ఇప్పుడు దొరికింది..

Posted: 11/19/2014 11:27 AM IST
Ak 47 used in aurobindo pharma vice chariman nityananda reddy firing was the one which lost last year doubts police

అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన వ్యవహరాంలో కేంద్రబిందువుగా మారిన ఏకే-47 గన్ ఎక్కడిది..? నగరంలో యధేశ్చగా ఏకే 47 గన్ లను తీసుకువచ్చి. సరఫరా చేస్తున్నవారెవ్వరూ అన్న ప్రశలకు ఉదయిస్తున్నాయి. ఏకే 47 తీసుకుని నగరంలో 5.3 అడుగుల ఎతైన మనిషి యధేశ్చగా ఎలా సంచరించాడు. కేబీఆర్ పార్కు వరకు వచ్చి అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిని ఎలా టార్గెట్ చేశాడు..? నగర నడిబొడ్డునే ఈ ఘటన జరిగినా.. ముందస్తుగా పోలీసులు పసిగట్టలేక పోయారు. అంతర్జాతీయ పోలిసింగ్ వ్యవస్థను తీసుకువస్తామన్ని చెప్పిన ప్రభుత్వ ప్రకటనలు ఎప్పడు నిజం కానున్నాయి

ప్రభుత్వ అదేశాల మేరకు అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటిని నిత్యం పోలీసులు పర్యవేక్షిస్తారని చెప్పుకోచ్చిన పోలీసు ఉన్నతాధికారుల మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. కాగా నిత్యానంద రెడ్డి కాల్పుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఆగంతకుడు కాల్పులు జరిపిన ఏకే 47 ...గత ఏడాది చోరీకి గురైనట్లు తెలుస్తోంది.  అటు ఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుండగుడు ఏకే 47 ఉపయోగించాడని... ఆ గన్... ఏడాది క్రితం గ్రేహౌండ్స్ పోలీసుల వద్ద చోరీకి గురైనట్లు తెలిపారు. సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామని సీపీ వెల్లడించారు. ఏకె 47 చోరీకి గురైనట్లు గ్రేహౌండ్స్ కమాండర్ శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గన్ను ఆగంతకుడు కాల్పులకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే అది ఈ గన్ నేనా లేక మరోకటా అన్నది కూడా నిర్ధారించాల్సి వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more