Laxmikanth parsekar elected as new cm of goa

laxmikanth parsekar, goa new cm, manohar parrikar, rajiv pratap rudy, Health minister, resigns, Goa chief minister

laxmikanth parsekar elected as new cm of goa

గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్

Posted: 11/08/2014 04:18 PM IST
Laxmikanth parsekar elected as new cm of goa

గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ను ఎంపిక చేసినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని చెప్పారు. గోవా ముఖ్యమంత్రి రేసులో ఒకవైపు పర్సేకర్, మరోవైపు ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే అధిష్ఠానం మాత్రం పర్సేకర్ వైపే మొగ్గుచూపింది. గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ ఇవాళ రాజీనామా చేశారు. ఆదివారం జరగనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో మనోహర్ కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా పర్సేకర్ను ఎంపిక చేశారు. పర్సేకర్ పేరును పాత ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ ప్రతిపాదించగా, ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా బలపరిచారు.

ఎంఎస్సీ, బీఈడీ చదివి, గోవా రాష్ట్ర ఆరోగ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ పర్సేకర్ ముందునుంచి బీజేపీలోనే ఉన్నారు. 1956 జూలై 4వ తేదీన యశ్వంత్ పర్సేకర్, చంద్రభాగ పర్సేకర్ దంపతులకు ఈయన జన్మించారు. గోవాలోని మాండ్రెం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో గోవాలో బీజేపీ విజయకేతనం ఎగరేసిన తర్వాత ఈయన మంత్రిపదవి చేపట్టారు. రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్కు ఈయన అత్యంత సన్నిహితుడని గోవా రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more