Children and youth addicted to junk food with the facebook and social media

facebook, social media, facebook latest news, social media latest news, junk foods, pizza, burgers, children, youth people, students

according to the australian survey children and youth addicted to junk food with the facebook and social media

అనారోగ్యం బారిన పడ్డానికి ‘‘ఫేస్ బుక్’’ కారణమట!

Posted: 10/27/2014 09:36 PM IST
Children and youth addicted to junk food with the facebook and social media

సోషల్ మీడియాలో ‘‘ఫేస్ బుక్’’ ప్రభంజన ఏవిధంగా వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! చిన్నపిల్లల నుంచి వృద్ధులవరకు దీనిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందులో ఏదో ఒకటి అప్ డేట్ చేస్తూనే వుంటారు. ముఖ్యంగా యుక్తవయస్సులో వున్నవారైతే మరీ ఎక్కువ! తిండితినకుండా వుండగలరేమోగానీ.. ఫేస్ బుక్ లేకుండా ఒక్క క్షణం కూడా వుండలేరు! ఒక్క మాటలో చెప్పాలంటే.. డ్రగ్స్ కంటే ఫేస్ బుక్ ప్రభావమే ఎక్కువగా వుందని కొన్ని సర్వేలు వెల్లడించాయి కూడా! ఇక తాజాగా మరో సర్వే ఒక సంచలన వార్తను విడుదల చేసింది.

ఈమధ్యకాలంలో జంక్ ఫుడ్ వాడకం చాలా ఎక్కువైపోయింది. అందులో బాలబాలికలు చాలా ఎక్కువగా పిజ్జా, బర్గర్లను తినేందుకు అత్యంత ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. అయితే వీళ్లంతా ఇలా జంక్ ఫుడ్ తినడానికి కారణం ‘‘ఫేస్ బుక్’’ అని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. ఎందుకంటే.. ఈ సోషల్ మీడియాలోని జంక్ ఫుడ్స్ కు సంబంధించిన మార్కెటింగ్ చాలా ఎక్కువగా వుందని, దీంతో పిల్లలు వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సర్వే వివరించింది. ఈ జంక్ ఫుడ్ లు నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్టిరాల్ ఎక్కువగా పేరుకుపోయి, రక్తప్రసరణకు అడ్డుపడుతోంది. దీంతో గుండెపోటు, ఇతర సమస్యలు వస్తాయి.

మొత్తానికి ఇక్కడ చెప్పుకోదలచుకున్నదేమిటంటే.. సోషల్ మీడియాలో జంక్ ఫుడ్ మార్కెటింగ్ చాలా ఎక్కువగా వుంది కాబట్టి.. వాటిని చూసి పిల్లలు వాటిమీద ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటున్నారు. అలా దానికి అలవాటు పడిపోయిన నేపథ్యంలో వాటివల్ల ఆరోగ్య కారణాలు తలెత్తుతాయి. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి కారణం ‘‘ఫేస్ బుక్’’ అని సర్వే వెల్లడించడం జరుగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  junk foods  australia sydney survey  unhealthy diseases  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more