Celebrities wish muslims on bakrid

president, pranab Mukharjee, chandrababu, KCR, governor, narasimhan, bakrid, greetings

celebrities wish Muslims on the eve of bakrid

ముస్లిం సోదరులకు.. ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు

Posted: 10/06/2014 08:52 AM IST
Celebrities wish muslims on bakrid

త్యాగానికి, విశ్వాసానికి బక్రీద్ ప్రతీక అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బక్రీద్ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ''పౌరులందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరులకు నా శుభాకాంక్షలు. త్యాగానికి, విశ్వాసానికి బక్రీద్ ప్రతీక. దేశ, ప్రపంచ సౌభాగ్యం కోసం విశ్వప్రేమ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలి'' అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో పేర్కొన్నారు. ఏకత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పటిష్ఠం చేసేలా బక్రీద్‌నుజరుపుకోవాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆకాంక్షించారు.

ఇటు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులు మహ్మదీయ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగానికి, దేవునిపై భక్తికి, పేదల పట్ల ఉన్న సంవేదనా శీలతకు నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. సమాజంలో పేదరికంతో బాధ పడుతున్న లక్షలాది ప్రజల సముద్ధరణకు అందరూ కలిసి కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : president  pranab Mukharjee  chandrababu  KCR  governor  narasimhan  bakrid  greetings  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more