Swachh bharat i have invited 9 people says narendra modi

Swachh Bharat, Narandra modi, priyankachopra, SalmanKhan, kamal haasan, Clean India mission, PM

swachh bharat i have invited 9 people says narendra modi

9 మంది సెలబ్రిటీలకు మోడీ స్వచ్చ భారత్ చాలెంజ్..!

Posted: 10/02/2014 01:20 PM IST
Swachh bharat i have invited 9 people says narendra modi

ఐస్ బక్కెట్ ఛాలెంజ్.... ఇప్పుడు స్వచ్ఛ భారత్కు కూడా పాకింది. విభిన్న రంగాలకు చెందిన తొమ్మిది మంది సెలెబ్రెటీలకు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సవాల్ విసిరారు. క్విట్ ఇండియా, క్లీన్ ఇండియా అన్న బాపూజీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ప్రధాని గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సినీ, వ్యాపార, వాణిజ్య, క్రీడ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన 9 మంది సెలబ్రిటీలకు తాను స్వయంగా సవాల్ విసిరానని ప్రకటించారు.

దేశంలోని ఏదేని బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనాలని ఆయన ఆ తొమ్మిదిమందికి ఆహ్వానం పలికారు. . స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ విషయాన్ని  స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది స్వచ్ఛ భారత్లో పాల్గొని...వారి మరో తొమ్మిదిమందికి ఆహ్వానం పలకాలని కోరారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, మరో అగ్రనటుడు కమల్ హాసన్, బుల్లి తెర నటుడు తారక్ మెహతా, వాణిజ్యవేత్త అనీల్ అంబానీ, గోవా గవర్నర్, ప్రముఖ రచయిత, సీనియర్‌ బిజెపి నేత మృదులా సిన్హా, ఆద్యాత్మిక వేత్త, యోగా గురు బాబా రాందేవ్ లు ఉన్నారు. అయితే దేశం పట్ల ఎంతో బాధ్యత కలిగిన నటుడు అమీర్ ఖాన్ మాత్రం ఎవరి ఆహ్వనం లేకుండానే స్వయంగా ఢిల్లీకి హాజరై స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat  Narandra modi  priyankachopra  SalmanKhan  kamal haasan  Clean India mission  PM  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more