Central government canceled holiday on october 2 gandhi jayanthi day

central government, gandhi jayanathi, october 2, government canceled holiday, government employees, government holidays, government schools, narendra modi government, bjp party news

central government canceled holiday on october 2 gandhi jayanthi day

ఉద్యోగస్తులకు చేదు వార్త! జీర్ణించుకుంటారా..?

Posted: 09/26/2014 07:53 PM IST
Central government canceled holiday on october 2 gandhi jayanthi day

సాధారణంగా నిరుద్యోగస్తులకు ఎప్పుడూ చేదు వార్తలు వస్తూ వుంటాయి. కానీ ఈసారి మాత్రం ఉద్యోగస్తులు జీర్ణించుకోలేని ఓ చేదువార్తను ప్రభుత్వం తెలిపింది. ఎప్పటినుంచో గాంధీ జయంతిరోజున ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పాఠశాలలకు సెలవు దినంగా కేంద్రప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే! కొన్ని చోట్ల అయితే ప్రభుత్వ స్కూళ్లలో గాంధీపై, స్వాతంత్ర్య సమరయోధులపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. గాంధీ జయంతి రోజున సెలవు తీసుకుని మంచి పని చేయాలని ఉద్బోధిస్తారు. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా.. ప్రత్యేకంగా జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఒక ప్రకటనను జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

‘‘స్వచ్ఛ్ భారత్’’ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాంధీ జయంతిరోజున ఉద్యోగస్తులందరూ విధులకు హాజరు కావాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగస్తులందరూ ఆరోజు కేవలం ‘‘స్వచ్ఛ్ భారత్’’ కోసమే పని చేయాలంటూ సూచించింది. మొదటగా ప్రధాని మోడీ ఇండియా గేట్ వద్ద చీపురుతో శుభ్రం చేసి, దేశానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత ఉద్యోగస్తులు కూడా అటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సి వుంటుంది. పరిసరాలు శుభ్రంగా వుంటే ప్రజలు ఆరోగ్యంగా వుంటారని కేంద్రం సూచిస్తోంది. అలాగే.. మహాత్మాగాంధీ కూడా పరిశుభ్రతనే కోరుకున్నారని కేంద్రం తెలుపుతోంది. సెలవును రద్దు చేయడం ఉద్యోగస్తులకు చేదు వార్తే కానీ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఎంతో అమోఘం అంటూ విమర్శకులు సైతం ప్రశంసలతో మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more