No modi sharif meeting in new york

PM, Narendra Modi, US visit, United States of America, Barack Obama, MEA, Syed Akbaruddin

No Modi-Sharif meeting in New York says MEA

ఆ ఐదు రోజులు.. మోడీ చాలా బిజీ..

Posted: 09/24/2014 11:39 AM IST
No modi sharif meeting in new york

అగ్రరాజ్యం అమెరికాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీష్ తో భేటీ అవుతారన్న వార్త కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రధాని మోడీ, షరీష్ తో భేటీ కారని స్పష్టంచేసింది. మోడీ ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పర్యటనలో అనేక మంది ప్రముఖులతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లను కలవనున్నారని విధేశాంగ శాఖ తెలిపింది. ప్రధాని వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వుంటారని ఆ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.

తన ఐదు రోజుల పర్యటనలో మోడీన 30 వ్యవహారాల్లో పాల్గొంటారని తెలిపారు. అమెరికా పరిపాలన, రాష్ట్ర నేతలు, వాణిజ్యవేత్తలు, ప్రవాస భారతీయులతో మోడీ భేటీ అవుతారన్నారు. ఈ నెల 29, 30న రెండు పర్యాయాలు మోడీ అమెరికా అధ్యక్షుడితో భేటీ అవుతారని చెప్పారు. వీరితో పాటు 29న అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ లతో కూడా భేటీ కానున్నట్లు తెలిపారు. వీరితో పాటు బంగ్లాదేశ్, నేపాల్ ప్రధానులను కూడా మోడీ కలుస్తారని చెప్పారు. ఈ నెల 27న ప్రధాని మోడీ.. వరల్డ్ టవర్స్ ఘటన మృతులకు నివాళులు అర్పిస్తారని, లింకన్, మార్టిన్ లూధర్, మహాత్మాగాంధీలకు శ్రద్దాంజలి ఘటిస్తారని అక్బరుద్దీన్ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM  Narendra Modi  US visit  United States of America  Barack Obama  MEA  Syed Akbaruddin  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more