Venkaiah naidu say no government can do wonders in 100days

Venkaiah Naidu, 100 days, Narendra Modi, mini polls

venkaiah naidu say no government can do wonders in 100 days

వందరోజుల్లో అద్భుతాలు ఎలా సాధ్యం.?

Posted: 09/17/2014 07:36 AM IST
Venkaiah naidu say no government can do wonders in 100days

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం వందరోజుల్లో అద్భుతాలు చేయలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. అయినా ప్రధాని నరేంద్ర మోడీ వంద ముందడుగులు వేశారని ఆయన స్పష్టం చేశారు. వీటన్నింటినీ పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో బీజేపి పార్టీ ప్రతిష్ట కేవలం వంద రోజుల్లోనే దిగజారిపోయిందని, మోడీ మానియా బీజేపి కంచుకోట గుజరాత్ లోనే పనిచేయడం లేదన్న విమర్శలపై స్పందించిన ఆయన.. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటోందన్నారు. ద్రవ్యోల్భణం దిగిరావడంపైనే ప్రస్తుతం ప్రధాని దృష్టి సారించారని చెప్పారు. దేశ ప్రజలు ఎంతో మేలు చేయాలనే మోడీ తపన పడుతున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ.. కేంద్రంలోని తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.

ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికలలో ఈ విషయం స్పష్టమయ్యిందన్నారు. కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీని తీసుకువెళ్లేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్రమే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందన్నారు. బకింగ్‌హామ్ కెనాల్‌ను శుభ్రం చేసి నౌకాయానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలన్నారు.  వంద రోజుల్లో తమ పార్టీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరిబాబును నిర్ణయిస్తూ జాతీయకౌన్సిల్ చేసిన ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  100 days  Narendra Modi  mini polls  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more