వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్‌లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయుధ బలగాలకు చెందిన 80 వైద్య సహాయక బృందాలు నిరంతరం సేవలందిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది ధైర్యసాహాలతో అనేక మంది అదృష్టవంతులు బతికి బయలపడ్డారు. ఇదివరకు ఎప్పడు కనీవీని ఎరుగని రీతితో వచ్చిన వరదల నేపథ్యంలో కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన బాధితులకు.. ఇప్పుడు విమానాశ్రయాల్లోనే నిలువు దోపిడికి గురవుతున్నారు.
శ్రీనగర్ సహా ఇతర ఎయిర్ పోర్టలకు సర్వీసులను నడుపుతున్న ప్రైవేటు ఎయిర్ లైన్స్ ధనదాహానికి బాధిత కుటుంబాలు ఛిధ్రమవుతున్నాయి. దారుణంగా వ్యవహరిస్తున్న విమానాశ్రయ సిబ్బంది తీరు వీరికి ఆగ్రహాన్ని తెప్పిచ్చింది. ఢిల్లీకి చేరుకుని సేద తీరుదామనుకుంటున్న వారిని ప్రైవేటు విమాన సర్వీసులు దోచుకుంటున్నాయి. విమాన చార్జీలనే కాదు బాధితులు తీసుకువస్తున్న లగేజీలను కూడా విమానసిబ్బంది దోచుకుంటున్నారు. శ్రీనగర్, లెహ్ ల నుంచి ఢిల్లీకి చేరుకునే వారికి రూ. 2800, రూ. 3000లను మాత్రమే వసూలు చేయాలని, బాధితులకు పన్ను మినహాయింపు కల్పించాలని సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ ప్రైవేటు ఎయిర్ లైన్ దోపిడీలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఇండిగో, జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు అసలు కన్నా రెట్టింపు చార్జీలను వసూలు చేస్తు బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
కాశ్మీర్ లో వరద బాధితులకు సాయం చేస్తున్నాం అంటూనే.. అందరూ తీసుకుంటున్నారు కాబట్టే తాము చార్జి చేస్తున్నామని ప్రైవేటు సర్వీసులు ఇస్తున్న సమాధానాలతో ప్రయాణికులు విస్తుపోయారు. తమ ప్రాణాలను రక్షించుకునే పనిలో భాగంగా తాము డబ్బు చెల్లించడం తప్ప వారే మార్గం లేదని బాధిత ప్రయాణికులు వారి ఆవేదనను వివరించారు.
దశాబ్ద కాలంతో శ్రీనగర్ లోని ఓ హోటల్ లో పనిచేసే నూరుద్దీన్ అనే బీహార్ వాసుడు.. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పాడు. విమానాశ్రయ సిబ్బంది పహారా నడుమ క్యూ కట్టిన తనకు సిబ్బంది డబ్బులు రెడీ పెట్టకోండి అన్న ప్రకటనలు వినిపించాయన్నాడు. విమాన టర్మినల్ లోకి అడుగుపెట్టిన తరువాత ప్రైవేటు ఎయిర్ లైన్స్ సిబ్బంది తనను రూ.4300 చార్జీగా చెల్లించాలని అడిగారు. దీంతో పక్కనున్న ఇండిగో ఎయిర్ లైన్స్ కౌంటర్లోకి వెళ్లి అడగ్గా వారు రూ.3600 చెల్లించాలన్నారు. చేసేది లేక తాను డబ్బు చెల్లించానని, అదే విమానంలో వచ్చని తన స్నేహితుడు రూ.4 వేలను చెల్లించాడని వివరించాడు. కనీస మానవత్వం కూడా లేని విమాన సిబ్బంది.. 4 వేల రూపాయలతో జీవితం లభిస్తున్నా.. ఇక్కడే వుండి చావాలని వుందా అంటూ వరద బాధితులపై జోకులు వేసి నవ్వుతున్నారని ఆరోపించారు.
ఇది చాలదన్నట్లు తమను విమాన సిబ్బంది చేతివాటానికి తాము విలువైన వస్తువులను కోల్పోయినట్లు బాధితులు చెప్పారు. శ్రీనగర్ లోని కరన్ నగర్లో టాక్సీడ్రైవర్ గా పనిచేసే షాబాజ్ ఖాన్ ఢిల్లీకి చేరుకున్న తరువాత తన లగేజీని పరిశీలించి, తన వస్తువులు పోయాయని గుర్తించాడు. బంగారు ఉంగరంతో పాటు 3 వేల రూపాయలను సిబ్బంది తస్కరించారని, ఈ విషయాన్ని తాను సంబంధిత అధికారులుకు పిర్యాదు చేశానని చెప్పాడు. షాబాజ్ ఖాన్ ఒక్కరే కాదు తమ వస్తువులను లగేజి సిబ్బంది తస్కరించారని అనేక మంది బాధితులు తెలిపారు.. మెహియుద్దీన్ అనే బాధితుడు ఢిల్లీ చేరుకోగానే తన విలువైన వస్తువులు, నగదు పోయినట్లు గుర్తించాడు. తన బ్యాగులోని వస్తువులు, నగదు ఎప్పడు దొంగతనానికి గురయ్యాయో కూడా తెలియదని విస్మయం చెందారు.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు రైల్వే స్టేషన్ లా మారిన విమానాశ్రయంలో ప్రతి బాధితుడిది ఏదో వ్యధ. మానవత్వంతో దేశం యావత్తు కదులుతున్నా.. ఈ విమానయాన సంస్థలు మాత్రం డబ్బును ఆర్జించే పనిలో నిమగ్నమవ్వడం విమర్శలకు తావిస్తోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more