బీహార్ లో ఓ రైలు తప్పిపోయింది. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా..,నిజంగా రైలు తప్పిపోయంది. పోలిసులు కూడా కంప్లయింట్ తీసుకుని వెతికారు. గాలింపు చేపడితే పదిహేడు రోజుల తర్వాత ఎటు వెళ్ళాలో తెలియక పట్టాలపై ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి స్టేషన్ కు తీసుకొచ్చారు. గోరఖ్ పూర్ - ముజఫర్ నగర్ మద్య నడిచే ప్యాసింజర్ రైలు ఆగస్టు 25న అర్ధరాత్రి తప్పిపోయింది. హాజిపూర్ ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో ఈ ప్యాసింజర్ రైలు మార్గం మల్లించారు. దీంతో రైలు వేరే రూట్లో పట్టాలు పట్టుకుని వెళ్లిపోయింది. అయితే రైలు వేరే మార్గంలో వెళ్తుందని తెలుసుకున్న ప్రయాణికులు మద్యలో దిగిపోయారు.
రైలు స్టేషన్ కు చేరకపోవటంతో అధికారులు గాబరా పడ్డారు. పోలిసులు కూడా ముందు స్టేషన్లలో రైలు ఆచూకి సమాచారం కోసం వెతికారు. ఎక్కడా కన్పించకపోవటంతో గోరఖ్ పూర్ - ముజఫర్ నగర్ రైలు కన్పించకుండా పోయింది అని ప్రకటించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలిసులు.., అన్ని డివిజన్ల అధికారులు రైలు కోసం గాలింపు మొదలు పెట్టారు. అలా వెతుకుతుండగా 17 రోజుల తర్వాత మరో డివిజన్ లో రైలును గుర్తించారు.
తప్పిపోయిన రైలును గుర్తించిన అధికారులు సంతోషంతో తిరిగి వెనక్కితీసుకెళ్లారు. రైలును కనుక్కోవటంతో కేసు నమోదు చేయలేదని పోలిసులు తెలిపారు. అయితే ఇంతకీ రైలు ఎక్కడకు వెళ్ళినా.., అందులోని లోకో పైలట్ ( రైలు నడిపే వ్యక్తి) తాను ఎక్కడున్నదీ సమాచారం అధికారులకు చేరవేయగలడు. పదిహేడు రోజులుగా ఆయన ఏం చేస్తున్నట్లు.., అతడు రైలు ఆపేసి ఎక్కడకు వెళ్ళిపోయాడు. అదే విధంగా ఓ మార్గంలో రైలు పదిహేడు రోజులుగా పట్టాలపైనే ఉంటే పట్టించుకోకుండా అధికారులు, రైల్వే సిబ్బంది ఏమి తెలియనట్లు ఉన్నారు. ఇది రైల్వే పనితీరు. రైళ్లను కాపాడుకోలేని వీరు ప్రయాణికులకు భద్రత ఇస్తారా అని ప్రశ్నలు వస్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more