(Image source from: bangalore rt police filed case on karthik gowda under ipc sections 376 420)
కన్నడ వర్ధమాన నటి మైత్రేయి గౌడ తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడంటూ కేంద్రమంత్రి సదానంద గౌడ్ కుమారుడు కార్తీక్ గౌడపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! ఈ విషయమై ఆమె బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కార్తీక్‌పై ఐసీపీ 376, 420 సెక్షన్ల కింద బెంగుళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే నటి మైత్రేయికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, ఇకపై కలిసి వుండటం కుదరదు అంటూ కార్తీక్ చెప్పినట్టు ఆమె పేర్కొంది. తనను ముందే పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థానికి సిద్ధమైతే తన పరిస్థితి ఎలా..? అంటూ ఆమె ప్రశ్నించింది. తనకు న్యాయం జరిగేంతవరకు పోరాటం సాగిస్తానని.. తనను కేంద్రమంత్రి కుటుంబసభ్యులు కోడలిగా అంగీకరించాల్సిందేనని ఆమె కోరుకున్నారు.
మరోవైపు ఈ విషయాన్ని ఖండించిన కేంద్రమంత్రి సదానంద గౌడ.. తనపై ఎవరో రాజకీయ కుట్రపన్నారని ఆరోపించారు. తన కొడుకును అన్యాయంగా ఇరికిస్తున్నారని ఆయన అన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సదానంద గౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం! అటు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హస్తం వున్నట్టు వచ్చిన ఆరోపణలను కర్ణాటక హోంమంత్రి జార్జి ఖండించారు. దర్యాప్తు తర్వాతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. కార్తీక్ నిశ్చితార్థం రోజే నటి మైత్రేయి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more