Anchor jhansi is introducing vinayaka bucket challenge

anchor jhansi, telugu anchor jhansi, jhansi latest news, anchor jhansi latest news, anchor jhansi hot photos, anchor jhansi hot photo shoot, anchor jhansi vinayaka bucket challenge, vinayaka bucket challenge, als ice bucket challenge, rice bucket challenge

Anchor jhansi is introducing vinayaka bucket challenge : telugu tv anchor jhansi is introducing a new vinayaka bucket challenge.

వినాయక ‘‘బకెట్ చాలెంజ్’’! ఒక మంచి ఆలోచన..

Posted: 08/29/2014 10:01 AM IST
Anchor jhansi is introducing vinayaka bucket challenge

(Image source from: Anchor jhansi is introducing vinayaka bucket challenge)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ పొందిన ‘‘ఐస్ బకెట్ ఛాలెంజ్’’ గురించి అందరూ వినే వుంటారు. పెద్దపెద్ద దిగ్గజాల నుంచి ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వా్మ్యం అవుతున్నారు. ఇక మన ఇండియాలో అయితే ఇదొక స్టంట్‌లా మారిపోయింది. మిగతావారి సంగతేమోగానీ.. మన తెలుగువాళ్లు మాత్రం దీనిని ఛాలెంజ్ చేస్తూ.. ‘‘రైస్ బకెట్ ఛాలెంజ్’’ను తెరమీదకు తీసుకొచ్చారు. దాంతో ఆమె అనూహ్యస్పందన రావడమేకాక కొంతమంది అదే తరహాలో బియ్యాన్ని పేదలకు పంచుతున్నారు కూడా! ఇప్పుడు వినాయకచవితి పండుగ సందర్భంగా ‘‘వినాయక బకెట్ ఛాలెంజ్’’ అంటూ ముందుకు వస్తున్నారు.

నేటి వెబ్ ప్రపంచంలో దుమారం రేపుతున్న ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా మనం కూడా ఒక కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభిద్దామంటూ.. ఈ ‘‘వినాయక బకెట్ ఛాలెంజ్’’ను పరిచయం చేస్తోంది యాంకర్ ఝాన్సీ! మన ఇంట్లో పూజించిన గణపతిని మన వాకిట్లోనే శాస్త్రాక్తంగా ఓ బకెట్ నీటిలో నిమజ్జనం చేద్దామన్నారు. ఒక గంటలో విగ్రహం కరిగిపోతే.. ఆ నీటిని మొక్కలకు పోసి, అడుగున ఉన్న మట్టిని తులసి కోటలోనో, పూల మొక్కల్లోనే వేసుకోవాలని ఝాన్సీ సూచించారు. ఈ బకెట్ నిమజ్జనం ఫోటోని కానీ, వీడియో కానీ ఫేస్‌బుక్‌లోనే, యూట్యూబ్‌లోనో అప్‌లోడ్ చేయండని ఆమె చెప్పారు. ఇలా చేయడం ద్వారా మనం మన చెరువులలో వున్న నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని ఆమె పేర్కొంది.

యాంకర్ ఝాన్సీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అమోఘమైంది. ఈమె అన్నట్టు మనందరం ఫాలో అయితే.. నీటిని కలుషితం కాకుండా చూసుకోవచ్చు. పెద్దపెద్ద విగ్రహాలను కూడా చెరువులలో, నదులలో వేయకుండా ఒక పెద్ద బకెట్‌లాంటి నిర్మాణాల్లో వేసి.. తర్వాత ఆ నీటిని మొక్కలకు నాటడానికి ఉపయోగిస్తే రెండువైపులా ప్రయోజనం కలుగుతుంది. ఒకవైపు నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవడం.. మరోవైపు మొక్కలను నాటి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more