Trs party mp k keshava rao comments tv9 abn andhra jyothy news channels suicide issue

trs mp k keshava rao, telangana assembly, tv9 and abn andhra jyothy news channels, telangana government, telangana news channels, andhra pradesh news channels, k keshava rao news

trs party mp k keshava rao comments tv9 abn andhra jyothy news channels suicide issue : trs party mp k keshava rao make controversial comments on tv9 and abn andhra jyothy news channels. He said If anyone proove that the ban of such news channel as wrong then I will hang myself.

టీవీ9 - ఏబీఎన్ కోసం ఉరేసుకుంటున్న కేకే!

Posted: 08/08/2014 04:42 PM IST
Trs party mp k keshava rao comments tv9 abn andhra jyothy news channels suicide issue

టీఆర్ఎస్ ఎంపీ కేకే టీవీ9 - ఏబీఎస్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెళ్ల కోసం ఉరివేసుకుంటానని ఆయన బహిరంగంగా లోక్ సభలో పేర్కోనడంపై చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదం రేపుతూ వార్తల్లో కనిపించే ఈయన.. ఈసారి ఆయా న్యూస్ ఛానెళ్ల మీద కామెంట్ సెన్సేషన్ సృష్టించారు. ఆయా టీవీ ఛానెళ్లు ప్రవర్తించిన తీరుపై ఆయన ఉరివేసకుంటానని పేర్కొన్నారు.

రాజ్యసభలో కేకే టీవీ9 - ఏబీఎన్ న్యూస్ ఛానెళ్ల ప్రసారాల గురించి మాట్లాడుతూ... ‘‘తెలంగాణ ప్రభుత్వం మీడియాపై భావప్రకటన స్వేచ్ఛను హరించడం లేదు. ఆ రెండు ఛానెళ్లు తెలంగాణ మంత్రుల మీద చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చాలా అవమానకరమైనవి. అటువంటి పరిస్థితుల్లో వాటిని ఆపేయడంలో ఎటువంటి తప్పులేదు. తెలంగాణ ప్రభుత్వం వాటిని ఆపేసి సరైన చర్య తీసుకుంది. ఏపీ మీడియా ఛానెల్స్ అధినేతలు మొదట తప్పు చేస్తారు.. తర్వాత క్షమించమని కాళ్లమీద పడతారు. అంతటితో ఊరుకోకుండా తిరిగి మళ్లీ అవే తప్పులు చేస్తారు. అలా జరగడం కంటే వాటిని నిలిపివేయడమే శ్రేయస్కరం’’ అని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే.. ‘‘తెలంగాణాకు సంబంధించిన వీ6, తెలంగాణ న్యూస్ ఛానెల్స్ ను ఆంధ్రలో నిలిపివేశారు. మరి దాని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. ఆంధ్రాకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా..? ఇదెలా సాధ్యమవుతుంది. ఒకవేళ టీవీ9 - ఏబీఎన్ ఛానెల్స్ ను ఆపేయడం సరైన చర్య కాదని ఎవరైనా నిరూపిస్తే.. నేను రాజ్యసభలోనే ఉరివేసుకుంటాను. ఇందుకు ఎవరైనా సిద్ధంగా వున్నారా..?’’ అంటూ సవాల్ చేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more