Kcr presents golden bonam to mahakali

KCR presents golden Bonam to Mahakali, Bonalu festival in Telangana, Telangana CM KCR to develop Mahakali temple, KCR to promote Bonalu

KCR presents golden Bonam to Mahakali

బోనాల సందర్భంగా కెసిఆర్ బంగారు బోనం

Posted: 07/20/2014 01:10 PM IST
Kcr presents golden bonam to mahakali

బోనాల సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హైద్రాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.  బంగారు బోనాన్ని తలమీద పెట్టుకుని మహంకాళి ఆలయానికి విచ్చేసిన కెసిఆర్ కి అక్కడ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

మహంకాళి ఆలయాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని, విస్తరణ కోసం భూమిని కేటాయించి ఆలయ నిర్మాణాన్ని నాలుగు కాలాలపాటు గుర్తుండేలా చేస్తానని మాటిచ్చిన కెసిఆర్ అమ్మవారి దీవెనలు ప్రజలందరిమీదా ఉండాలన్న తన ఆకాంక్షను వెల్లడి చేసారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేశ్ కుమార్ కూడా ముఖ్యమంత్రితో పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.  

దీనికి ముందు హరిబౌలి లోని అక్కన్న మాదన్న ఆలయంలో కూడా కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన బోనాలు వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఘనంగా జరిపిస్తామంటున్నారు కెసిఆర్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more