అతి తక్కువ వయస్సులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి, భారత్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన యువనాయకుడు అఖిలేష్ యాదవ్! ఈయన సీఎం పీఠాన్ని అధిష్టించిన కొన్నాళ్లవరకు ప్రజలకు అనుగుణంగా కొన్ని పథకాలను అమలు చేశాడు. మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లవరకు ఇతని హవా యావత్ భారతదేశం మొత్తం మీద పాకిపోయింది. అయితే ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ... అఖిలేష్ తన ప్రవర్తనలో మార్పు తెచ్చకున్నాడు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, రాష్ట్రంలో మంచిగా వున్న పరిస్థితులను తారుమారు చేసేశాడు. దీంతో సామాన్య ప్రజలు ఈయన మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈయనకు వ్యతిరేక పవనాలే వీచాయి.
యువముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించినప్పటికీ... ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేకపోయాడు. అక్కడి ప్రభుత్వం చాలారకాలుగా విమర్శలపాలయ్యింది. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఇక పనికిరాడని, రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడలేకపోయాడని అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొన్నటి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖిలేష్ కు చుక్కలు కనిపించేలా అన్ని స్థానాలను పూర్తి చేసుకుంది. ఈ విధంగా ఘోరంగా పరాజయం కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని ప్రతిఒక్కరు అనుకుంటున్నారు. అయితే అందుకోసం ఇంకా 3ఏళ్లు సమయం వుంది. అంతలోపు ఎలాగైనా పరిస్థితులను చక్కదిద్దుకోవాలని, తిరిగి తానే అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించినట్టున్నాడు అఖిలేష్ యాదవ్.
తాజాగా ఈ యువనాయకుడు తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాడని సమాచారాలు వెలువడుతున్నాయి. ప్రజలను తనవైపు ఆకట్టుకోవడానికి సరికొత్త ప్రణాళికలతో కూడిన పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. అందులో భాగంగానే ఇళ్లకు ఉచిత కరెంట్ పథకాన్ని ప్రారంభించాడు. దారిద్ర్యరేఖకు దిగువగా వున్న కుటుంబాలు కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారందరికీ ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తుందని ప్రకటించాడు. ఈమేరకు యూపీ ప్రభుత్వం ఒక ప్రటకన విడుదల చేసింది. తాను పోగొట్టుకున్న ఇమేజ్ ని తిరిగి సంపాదించుకోవడం కోసమే అఖిలేష్ ఇటువంటి ఉచిత పథకాలను ప్రవేశపెడుతున్నాడని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more