10 సంవత్సరాల బాలికను గ్రామస్తుల సమక్షంలో 25 సంవత్సరాల యువకుడు మంగళవారం నాడు రేప్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అది జార్ఖండ్ లో బొకారో జిల్లాలోని మారుమూల గ్రామం. శిక్షగా తల నరికే విధానం ఉన్నప్పుడు ఆ పనిని పూర్తి చెయ్యటానికి తలారులు ఉన్నట్లుగా, రేప్ చెయ్యటానికి ఈ యువకుడు పనికివచ్చాడు ఆ గ్రామ పెద్దకు. అంతే కాకుండా మరో అత్యాచార బాధితురాలికి అన్న కూడా.
ఇంతకీ ఆ బాలిక అపరాధమేమిటంటే, మరో అమ్మాయి మీద అత్యాచారం చెయ్యబోయిన అన్నకు చెల్లి అవటం. ఆ అమ్మాయి అన్న, రేప్ చేసిన ఆ యువకుడి చెల్లెలి మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో జరిగిన వైద్య పరీక్షలో ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందన్నది తేలింది. బాధితురాలి తండ్రి పొలం పని మీద పోయినప్పుడు ఆ బాలికను బలవంతంగా ఇంట్లోంచి బయటకు తీసుకునివచ్చి ఆ విధంగా శిక్షించటం జరిగింది.
జరిగింది గ్రామస్తులంతా చూసినా సాక్ష్యం చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అందుకు కారణం తనకు తాను గ్రామపెద్దగా ప్రకటించుకుని చెలామణి అవుతున్న ఆ మనిషి మీద గల భయం. బాలికను ఇంట్లోంచి బయటకు తీసుకునివచ్చిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె తల్లి కూడా జరిగిన విషయాన్ని మౌనంగా సమ్మతిస్తోంది.
పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రామ పెద్ద, ఆ బాలికను రేప్ చేసిన వ్యక్తి, అతని చెల్లెలి మీద అత్యాచారానికి ఒడిగట్టిన ఆ బాలిక అన్నను మొత్తం ముగ్గురినీ అరెస్ట్ చేసారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని జార్ఘండ్ పోలీస్ అధికార ప్రతినిధి మీడియా ప్రతినిధులకు తెలియజేసారు.
నాగరికతలో అభివృద్ధి చెందుతున్నామనుకుంటున్న ఈ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మనదేశవాసులు ఇంకా ఎప్పుడు పూర్తి స్థాయి నాగరిక సమాజ స్థాపన చేస్తారన్నది అంతు తెలియకుండా ఉందని అంటున్నారు సమాజంలో పెద్ద మనుషులు.
తెలుగులో పాత కథ ఒకటుంది. గాడిద మీద కోపంతో ఒకామె దాన్ని కర్రతో కొడితే ఆ గాడిద కాలు విరుగుతుంది. అది చూసి ఆగ్రహించిన ఆ గాడిద యజమాని ఆమెను తోసివేస్తే ఆమె గర్భిణీ అవటం వలన ఆమె గర్భం పోవటం జరుగుతుంది. ఇద్దరూ న్యాయనిర్ణేత దగ్గరకు పోయినప్పుడు, గాడిదను తన్ని కాలు విరగకొట్టినందుకు ఆమె భర్త ఆ గాడిదకు నయం చేయించాలని చెప్తూ, గర్భం పోయేట్టు చేసిన ఆ గాడిద యజమాని ఆమె మళ్ళీ గర్భం దాల్చేలా చెయ్యాలని న్యాయం చెప్పటం జరుగుతుంది.
గ్రామ పెద్ద ఇచ్చిన తీర్పు కూడా అలాగే వుంది కదూ!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more