(Image source from: Hero shivaji sensational comments on local parties)
దేశం నాశనం అవ్వడానికి ముఖ్యకారణం ప్రాంతీయ పార్టీలేనని ఒక సినిమా హీరో సంచలనమైన వ్యాఖ్యలు సృష్టించి, వార్తల్లో నలుగుతున్నారు. దేశంలో అసలు ప్రాంతీయ పార్టీలు వుండకూడదని, ప్రాంతీయ పార్టీల వల్లే నా ప్రాంతం అనే భావన మొదలైందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రాంతీయ పార్టీలవల్లే దేశం దారిద్ర్యం అధికం అవుతోందని... ప్రాంతీయ పార్టీలు అసలు వుండకూడదని... వాటివల్లే దేశం నాశనం అవుతోందని ఒక హీరో ఆరోపించారు.
ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొందరు ప్రముఖ హీరోలు కొన్ని పార్టీల తరఫున ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! అందులో ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ తరఫున అగ్రస్థాయి హీరోలయిన పవన్ కల్యాణ్, నాగార్జున తదితరులు కూడా వున్నారు. ఇక చిన్న సినిమాల హీరో అయిన శివాజీ కూడా ఆయన తరఫున ప్రచారం చేశారు.
ఇప్పుడు తాజాగా ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పార్టీ పెంచిన ఛార్జీల గురించి మాట్లాడుతూ... కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ‘‘దేశంలో వున్న రైల్వే వ్యవస్థను, మిగతా ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం కోసం... ప్రస్తుతం వెనుకబడి వున్న మన దేశాన్ని మెరుగుపరచడం కోసమే ఇలా బీజేపీ పార్టీ రైల్వే ఛార్జీలను, ఇతర ఛార్జీలను పెంచారని’’ ఆయన స్పష్టం చేశారు. ‘‘అంతేకానీ... ప్రాంతీయ పార్టీలు దీనిని అదునుగా తీసుకుని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని.. వారివల్లే దేశం నాశనం అవుతోందని’’ ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే... ‘‘ప్రాంతీయపార్టీలు అధికారం వున్నప్పడు ఒక విధంగా.. లేనప్పుడు మరొక విధంగా ప్రవర్తిస్తున్నాయని’’ అన్నారు. ప్రాంతీయపార్టీలు నిజంగానే దేశ అభివృద్ధిని కోరుకుంటే... వారు ప్రాంతీయతత్వ కామెంట్లు చేయడం మానుకోవాలని... ఈ తరంలో వున్న ప్రజలు, విద్యార్థులు దీని గురించి తెలుసుకుని, మార్పు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. మన భారతదేశంలో ప్రాంతీయతత్వం ఎక్కువగా వుండటం వల్లే ఇతర దేశాలలాగా అభివృద్ధి చెందడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య వున్న వ్యత్యాసం గురించి ఆయన విశ్లేషించారు. ‘‘బీజేపీ పార్టీని చాలామంది మతతత్వ పార్టీ అంటారు. కాంగ్రెస్ ని కుటుంబ పార్టీ అంటారు. కాంగ్రెస్ నిజంగానే కుటుంబ పార్టీ అయితే... ముస్లిముల కోసం ప్రత్యేకంగా హోదాలు కల్పిస్తామని ఎందుకు చెప్పాలి. అసలు మతతత్వాన్ని రేకెత్తించింది కాంగ్రెస్ పార్టీ. హిందూ-ముస్లిం భాయి-బాయి అంటూ బతుకుతున్న జనాలను... హిందువులకు ఇంత శాతం రిజర్వేషన్లు కేటాయిస్తాం.. ముస్లిములకు ఇంత శాతం వాటా కల్పిస్తామని చెప్పి... వారిమధ్య గొడవలు రేకెత్తించింది కాంగ్రెస్ పార్టీ’’ అని తీవ్రంగా ఆరోపించారు. ఇదంతా గతం... ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి బాటలో నడవాలంటే ప్రాంతీయపార్టీలు ప్రాంతీయతత్వాన్ని వదిలేసి... వారికి నచ్చిన పార్టీలో చేరి.. దేశాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more