గరిష్టంగా మూడు లేదా నాలుగు సంవత్సరాలు విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి హైదరాబాదులో స్థిరపడిన వారే అయినా.. ఫీజు రీయింబర్స్మెంట్ ఖర్చులు పొదుపు చెయ్యటానికి కేసీఆర్ సర్కారు స్థానికత అనే వివాదాస్పద అంశాన్ని తెరమీదకు తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం స్థానికత విషయంలో ఒక నిర్దారణకు దాదాపుగా వచ్చేసినట్లే. 1956 కన్నా ముందు నుంచీ తెలంగాణలో నివసించిన వారినే స్థానికులుగా గుర్తించాలన్న ప్రతిపాదననే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ బిడ్డలకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామని ఇప్పటికే స్పష్టం చేశాం. దానికే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో చదివినా.. దేశంలో ఎక్కడ చదువుకుంటున్నా అర్హులైన వారందరికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. దీనిపై రాద్ధాంతం అనవసరం. హైదరాబాద్ స్టేట్ ఆంధ్రరాష్ట్రంలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాతే సీమాంధ్ర వాళ్లు తెలంగాణ జిల్లాలకు వచ్చారు. అంటే వారి బీజాలన్నీ ఆంధ్రావే కదా. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుందని కెసిఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.దీనికి అనుగుణంగా నివేదిక తయారు చేసి నిబందనలను రూపొందించాలని కెసిఆర్ అదికారులను ఆదేశించినట్లు కధనం. ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు చెల్లించడం కుదరదని ఆయన అన్నారు.
1956 అంటే అప్పుడు పుట్టిన వాళ్ళు ఇవ్వాలో రేపో రిటైర్ అవుతారు!!! ఈ కొత్త స్తానికత లేని విద్యార్ధులు ఎంత మంది తెలంగాణా ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించారో !! ప్రపచంలో ఎంతో అభివ్రుది చెందిన దేశాలు ( USA, UK, Europe, Australia ..etc) వీసా కి queue లో నిలబడే మనవాళ్ళు ఎంత మంది 1956 నుంచి వాళ్ళ స్తనికతకు ( residence / citizenship) కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు? ఎక్కడ లేని వితండ వాదం తో మడత పేచీ లు ఎంత వరకు సబబు? అలాగే 1956 తర్వాత వచ్చిన వాళ్ళు చెల్లిస్తున్న పన్నులు , కాంట్రిబ్యూషన్కూ ని ఏమిచెయ్యాలి? ఈ ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ తో బెనిఫిట్ ఇయ్యెది పేద విద్యార్ధులు కాని డబ్బు వున్నా వాళ్ళు కాదు ...
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంపకానికి సంబంధించి.. ఆప్షన్లు ఇస్తారనే చర్చ తెరమీదకు వస్తోంది. ఆప్షన్లు ఉంటాయనే మాట రాగానే.. ఆంధ్ర ప్రాంతంలో పనిచేయడానికి ఉద్యోగులు ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 వరకు ఉంటుంది. తెలంగాణలో అయితే 58కి రిటైర్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర సేవల్లోకి వెళ్లిపోవడానికి దాదాపు 8వేల మంది తెలంగాణ ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడేళ్ల వ్యవధిలో రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్న సీనియర్లు ఈ ఆప్షన్లు ఇవ్వాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చివరి రెండు మూడేళ్లు అక్కడ పనిచేసి తిరిగి వచ్చేస్తే.. ఇక జీవితాంతం పెన్షన్లు, గ్రాట్యుటీల వంటి లబ్ధి అన్ని రకాల భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడుతుంది.
ఒక్కొక్కరి నెలసరి వేతనాలు రెండు ఏళ్ల ఫీజురీఇంబర్స్మెంటుల్లాగా, వారి పెన్షన్లు ఒక్కో ఏడాది ఫీజు రీఇంబర్స్మెంట్లాగా భారీ భారంగా మారే ప్రమాదం ఉంది
అసలే నిధుల కొరతతతో విలవిల్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. చేజేతులా తెలంగాణ ఉద్యోగులు కొన్నాళ్లు పనిచేసి వెళ్లిపోయినందుకు వారిని జీవితాంతమూ పోషించాల్సి వస్తుంది.
ఆంధ్ర విద్యార్థులకు కేవలం నాలుగేళ్లు పరిమితమైన ఫీజుల్ని చెల్లించడాన్ని ఎగ్గొట్టడానికే కేసీఆర్ సర్కారు నానా మార్గాలు వెతుకుతున్న సమయంలో.. జీవితపర్యంతమూ తెలంగాణ వారిని పోషించే బాధ్యత, ఆర్థిక భారం తీసుకోవడానికి చంద్రబాబు సర్కారు ఎలా అంగీకరిస్తుంది?
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more