(Image source from: American post office delivers a letters after 83 years)
ఎంత అభివృద్ధి చెందిన దేశాలయినా... ఎక్కడ ఒక చోట లోటు వుంటుందని చెప్పడానికి తాజాగా ఒక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ లెక్కల ప్రకారం... గతంలో మన భారతదేశాన్ని అత్యంత వెనుకబడిన దేశంగా కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే మనదేశం కంటే మరీ ఘోరంగా విదేశీయుల ప్రభుత్వాలు వున్నట్లు కనిపిస్తున్నాయి.
ఎప్పుడో 1931లో ఒక యువతి రాసిన ఉత్తరాన్ని 83 ఏళ్ల తరువాత బట్వాడా చేశారు. అమెరికాలో నివాసం వున్న మిరియమ్ మెక్ మైకేల్ అనే 23ఏళ్ల యువతి... 1931లో తన తల్లి డొలేనా మైక్ మైకేల్ కు తొమ్మిది పేజీలతో కూడిన ఒక సుదీర్ఘ ఉత్తరాన్ని రాసింది. (బహుశా అది చాలా ఇంపార్టెంట్ విషయం అయి వుండొచ్చు). అలా రాసుకున్న ఆ ఉత్తరాన్ని పోస్టు చేసిన ఆమె... తన తల్లి దగ్గరకు చేరుకుంటుందిలే అనే ధీమాతో పట్టించుకోలేదు.
కానీ కొన్ని ఏళ్లు గడిచిపోయాయి... తరాలు మారిపోయాయి... మనుషులు కూడా మారిపోయారు కానీ ఆ ఉత్తరం మాత్రం చేరాల్సిన చోటుకు చేరకుండా పోస్టాఫీసులోనే ఒక మూల పడివుంది. ఇటీవలే ఆ పోస్టాఫీసులో పనిచేసే మిచెల్లీ రోవెల్ అనే ఉద్యోగస్తునికి మూలపడిన ఈ ఉత్తరం కంటపడింది. దానిపై రెండుసెంట్ల విలువ చేసే స్టాంపు కూడా అంటించి వుంది. దానిని చూసి దీర్ఘంగా పరిశీలించగా... అది 83ఏళ్ల క్రితం రాసిన ఉత్తరం అని తేలింది. దాంతో అతను ఈ విషయం గురించి అతని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
పోస్టాఫీసు అధికారులు కూడా దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత అది 1931లో ఒక యువతి రాసిన ఉత్తరం అని తెలుసుకున్నారు. దాంతో వారు తమ నిర్వాకాన్ని తెలుసుకుని.. వెంటనే ఆ ఉత్తరం మీదున్న చిరునామా గురించి వెదుకులాట మొదలుపెట్టారు. పోస్ట్ మాస్టర్, ఇతర పట్టణాధికారులు ఎంతో కష్టమ్మీద ఆ కవర్ పై వున్న చిరునామాను వెతికి పట్టుకుని... అందులో నివాసమున్నవారికి అప్పగించి.. తమ నిర్వాక బాధ్యతని నిర్వర్తించారు.
అయితే ఇక్కడ విచారించుకోవాల్సిన విషయం ఏంటంటే... ఆ ఉత్తరం రాసిన వ్యక్తి, తీసుకోవాల్సిన వ్యక్తి ఇద్దరూ.. ఈ భూప్రపంచం మీద అడ్రస్ లేకుండా పోయారు (చనిపోయారు). ఈ ఉత్తరాన్ని ఇప్పుడు ఆ ఇంట్లో నివాసం వుంటున్న మిరియమ్ మేనకోడలు ఆన్ మైక్ మైకేల్ (69)కి పోస్టాఫీస్ అధికారులు అప్పగించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more