Tapas pal comments on rape

tapas pal comments on rape, tapas pal wife apologizes for his remarks, tapas pal comments make protests

tapas pal comments on rape

రేప్ సంచలనంలో భార్య రంగప్రవేశం

Posted: 07/01/2014 01:50 PM IST
Tapas pal comments on rape

సిపిఎమ్ కార్యకర్తలను చంపేస్తాం వాళ్ళ భార్యలను మా కుర్రాళ్ళచేత రేప్ చేయిస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తపస్ పాల్ భార్య రంగప్రవేశం చేసి తన భర్త అన్న మాటలకు క్షమాపణ కోరటం జరిగింది.  తన భర్త అలా మాట్లాడటం తప్పేనని ఆమె ప్రకటించారు.  ఇది చూస్తే ఒక సంఘటన గుర్తుకొస్తుంది.

చెన్నైలో జేబులు కత్తిరంచే మనిషి పట్టుబడి, పోలీసులు రాకముందే జనం చేత దెబ్బలు తింటున్నాడు.  ఇంతలో అతని భార్య గట్టిగా అరుచుకుంటూ వచ్చింది.  తన భర్తను కొట్టవద్దని కాదు ఇంకా కొట్టమని.  ఎన్ని సార్లు చెప్పినా తాగుడుకి అలవాటుపడి దొంగతనాలకు మరిగాడని, తనేమో పిల్లల్ని పోషించటానికి ఇళ్ళల్లో చాకిరి చేసుకుంటున్నానని, అలాంటి వాడిని క్షమించి వదిలిపెట్టద్దని, కొట్టటం కాదు చంపెయ్యండని అన్నదామె.  ఆమెతోపాటు ఆమె పిల్లలు కూడా బావురుమని ఏడుస్తున్న ఆ సన్నివేశం గుమికూడిన జనాలలో సానుభూతిని రేకెత్తించింది.  దొంగతనం చేసే మనిషిని కొట్టేవాళ్ళు కాస్తా ఆ కుటుంబానికి సాయంగా తలా కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు.  జేబులు కత్తిరిస్తే వచ్చేదానికంటే ఎక్కువే వచ్చాయి, పైగా ఆమె తన భర్తను దక్కించుకుంది.  ఎక్కువ దెబ్బలు తగిలితే తెల్లవారి బయటకు పోయి మళ్ళీ తన వృత్తిలో పని చెయ్యలేడుగా!

అయితే ఎంపీ హోదా పెద్దది కాబట్టి ఇక్కడ సన్నివేశంలోను, సంభాషణల్లోనూ తేడా ఉంటుందనుకోండి.  కానీ సంచలన వ్యాఖ్యలకు వచ్చిన గాలిదుమారాన్ని ఎలాగో ఒకలా అడ్డుకోవాలి కదా!

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more