(Image source from: war between jagan and chandrababu in ap assembly)
తాజాగా మొదలయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఒకర్నొకరు దూషించుకుంటున్నారు. తాజాగా రాష్ట్రాభివృద్ధి గురించి జగన్, చంద్రబాబు మధ్య మాటలయుద్ధం గరంగరంగా కొనసాగాయి. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ... ‘‘ఆంధ్రప్రదేశ్ లో వుండే 13 జిల్లాలు అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది వున్నాయి. అనవసరమైన నిధులను కేటాయించడకుండా పేదప్రజల బాగోగులు గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు.
అయితే జగన్ ప్రసంగానికి అడ్డుపుడతూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. జనగ్ చెప్పిన మాటలను నిలదీస్తూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ లో వున్న జిల్లాలు అభివృద్ధి అయ్యాయన్న మాటలు వాస్తవం కావు. జగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే... కేంద్రానికి తప్పుడు సమాచారం అందుతుంది. ఆయన చెప్పిన మాటలు విని కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులను కేటాయించదు. దీంతో ఆంధ్రరాష్ట్రం ఎప్పటికీ అభివృద్ది చెందదు. జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే... రాష్ట్రాన్ని బాగపడుకూడదనే ఆలోచనలో వున్నారు’’ అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
అలాగే ‘‘ప్రతిపక్ష హోదాలో వుండి కూడా మద్దతునివ్వకుండా ఇలా ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డపడటం ఏ విధంగా సమంజసం’’ అని ప్రశ్నించారు. ఇలా ఈ విధంగా సాగినా వీరిద్దరి మాటల యుద్ధంలో చివరగా చంద్రబాబు... ‘‘మీరు మామీద ఆరోపణలు చేయడానికి ఇంకా 5 సంవత్సరాల వరకు కాలం వుంది. ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు. లేనిపోని వ్యాఖ్యలతో అనవసరంగా రచ్చరచ్చ చేయొద్దు’’ అని సూచించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more