(Image source from: chandrababu planning to make an airport between nuziveedu and khammam districts)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు... రాష్ట్ర అభివృద్ధి కోసం మొదటిరోజు నుంచే సన్నాహాలు చేపట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ సిటీని మించేలా ఆరు సిటీలను నిర్మిస్తానని హామీ కూడా ఇచ్చారు. ప్రమాణ స్వీకారం రోజే తాను ఒక కూలీ పనివాడిలాగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని కూడా అందరిముందు వాగ్ధానం కూడా చేశారు. ఆరోజే అందరి సమక్షంలో వివిధ రకాల పథకాల మీద ఐదు సంతకాలను చేశారు. రైతులకు రుణమాఫీ, 2 రూపాయలకే 20 లీటర్ల నీరు ప్రతి గ్రామానికి చేరేవిధంగా సుజల పథకం, పదవీ విరమణ 60 సంవత్సరాలవరకు పెంపు, వికలాంగులకు - వృద్ధులు 1000 రూపాయల వరకు ఫింఛన్ల పెంపు, బెల్టు షాపుల రద్దు వంటి దస్త్రాలపై సంతకాలు చేసి... మొదటిరోజు నుంచే సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తించారు.
తాజాగా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అనేక రకాల కార్యకలాపాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ విషయమై శివరామకృష్ణన్ కమిటీ వారితో తరచూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై శివరామకృష్ణన్ కమిటీవారు ఒక రాష్ట్ర రాజధానిని నిర్మించడం అసాధ్యం అని చంద్రబాబుకు నోటీసు పంపితే... వారికి బదులుగా ఆయన హార్డ్ వర్క్ అనేది తన రక్తంలో వుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచస్థాయిలోనే పేరుగాంచే విధంగా ఒక రాజధానిని సృస్టిస్తానని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ వారితో సమావేశమైన తరువాత ఆంధ్రప్రదేశ్ నగరానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సీమాంధ్రలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని, కమిటీవారితో కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారాచంద్రబాబు నాయుడు నూజివీడు (కృష్ణా జిల్లా) - ఖమ్మం ప్రాంతాల మద్య అంతర్జాతీయ విమానాశ్రయానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాల్సిందిన సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఆ ప్రదేశంలో విద్యాసంస్థలు, ఆస్పత్రులు, సాఫ్ట్ వేర్ వంటి ప్రైవేటు రంగాల ఏర్పాటు చేయాలనే వారికి దావా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాంతాన్ని కూడా తొందరలోనే ప్రకటిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more