ఆమ్ ఆద్మీ పార్టీకి దేశంలో విదేశాలలోనూ మద్దతు బాగా ఉంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ పార్టీకి చందాలు వచ్చి పడుతున్నాయి. ఢిల్లీ పదవీ త్యాగం చేసి జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన ఆఆపా తమకున్న బలాన్ని ఇంకా పెంచుకోవటం కోసం తమ సొంత టివి ఛానెల్ పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న విషయంలో ఒక నిర్ణయానికి అప్పుడే రానేవచ్చింది. ఇక జరగవలసింది కార్యాచరణే.
ప్రస్తుతమున్న మీడియా తమ పార్టీని ఎక్కువగా కవర్ చెయ్యటం లేదన్న అభిప్రాయం కలగటం వలన ప్రజలకు, ముఖ్యంగా విదేశాలలో ఉన్న భారతీయులకు దగ్గరవాలనే ఉద్దేశ్యంతోనే 24 గంటల యూట్యూబ్ ఛానెల్ తో సొంత మీడియా అనే ఆలోచనకు కార్యరూపమివ్వనుంది.
ఇందులో ప్రచార వీడియోలు, ప్రసంగాలు, పార్టీ నేతలతో ఇంటర్వ్యూలను అప్ లోడ్ చెయ్యదలచుకున్నారు. ఆప్ మీద సదభిప్రాయమున్న ప్రవాస భారతీయులు ఆఆపా కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగాలకు బాగా స్పందించినట్లుగా తెలియరావటంతో వారికి మరింతగా చేరువవటం కోసం ఆప్ టివి ఛానెల్ బాగా ఉపకరిస్తుందని ఆఆపా పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more