Bhaskara Sathakam in Telugu 51534 Bhaskara Satakalu

Bhaskara satakam

Bhaskara Sathakam, Bhaskara Satakalu, Telugu Satakalu, Bhaskara Satakalu in Telugu అలఘు = గొప్పవైన లక్షణాలు ; గుణప్రసిద్ధుడు = మంచి గుణాలతో నిండిన గొప్పవాడు ; నట్టి = అయిన ; ఘనుడు = మహనీయుడు

Get the Bhaskara Sathakam పూర్వం కుచేలుడు, శ్రీకృష్ణుని గొప్పతనం తెలుసుకుని అతనికి ఒక పిడికెడు అటుకులు ఇవ్వగా... ఫలప్రదముడైన శ్రీకృష్ణుడు ఆ కుచేలుడికి ఎన్నో మహాసంపదలు బహుమానంగా ఇచ్చాడు. అలాగే తెలిసినవారు ఎవరైనా మోసగిస్తే.. గొప్పగుణాలను కలిగినవాడు అతనిని క్షమించి, ఇంకా ఎక్కువ మేలు చేస్తాడు. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 04/05/2014 11:31 AM IST
Bhaskara satakam

అలఘు గుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుఁడొకఁడిష్టుఁడై తనున్ 

వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుఁగా, 

తెలిసి కుచేలుఁడొక్క కొణి దెండడుకుల్ దన కిచ్చినన్ మహా 

ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక భాగ్యము లాతని కీఁడై భాస్కరా!

టీకా : అలఘు = గొప్పవైన లక్షణాలు ; గుణప్రసిద్ధుడు = మంచి గుణాలతో నిండిన గొప్పవాడు ; నట్టి = అయిన ; ఘనుడు = మహనీయుడు ; ఒకఁడు = ఎవరైనా ఒకడు ; ఇష్టుఁడు + ఐ = కావలసినవాడు ; తమన్ = తనను ; వలచి = కాంక్షించి ; ఒకించుక = కొద్దిగా ; ఏమిడిన = ఏమి పెట్టినా ; వానికిన్ = ఇచ్చినవారికి ; మిక్కిలి = ఎక్కువగా ; ఒక్క కొణిదెండు = ఒక పిడికెడు ; తనకు = శ్రీకృష్ణునికి ; ఇచ్చినన్ = ఈయగా ; మహాఫలదుఁడు = గొప్ప ఫలాలను ఇచ్చువాడు ; భాగ్యములు = సంపదలు ; అతనికిన్ = ఆ కుచేలునికి ; ఈడె = ఇవ్వడం 

తాత్పర్యము : పూర్వం కుచేలుడు, శ్రీకృష్ణుని గొప్పతనం తెలుసుకుని అతనికి ఒక పిడికెడు అటుకులు ఇవ్వగా... ఫలప్రదముడైన శ్రీకృష్ణుడు ఆ కుచేలుడికి ఎన్నో మహాసంపదలు బహుమానంగా ఇచ్చాడు. అలాగే తెలిసినవారు ఎవరైనా మోసగిస్తే.. గొప్పగుణాలను కలిగినవాడు అతనిని క్షమించి, ఇంకా ఎక్కువ మేలు చేస్తాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more