అనఘునికైనఁ జేకుఱు వనర్హునిఁగూడి చరించినంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైనఁ దప్పవు యథార్థము, తానది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా !
టీకా : ధరిత్రియందున్ = భూమిలో ; అనర్హునిన్ = తగనివాడు ; కూడి చరించినంతలో = స్నేహంచేసి తిరిగే కాలములో ; అనఘునికైనన్ = మంచివానికైన ; ఎరియంగన్ = సంకటపడినట్లు ; ఏయనువుననైన = ఏ విధమైంగానైనా ; చేకుఱున్ = కలుగును ; తప్పవు = ఏదో విధంగా లభించడం ; యథార్థము = నిజమైంది ; ఎట్టులన్నచో = ఎటువంటివారని ; సమ్మెటపెట్టు = సమ్మటవేటు ; అలయింపదె = సంకటపెట్టదా?
తాత్పర్యము : ఏ విధంగా అయితే అగ్నికి, ఇనుమును కలిగి వుండటం వల్ల సమ్మెటపోటు తప్పదో... అదే విధంగా ఎంతటి మంచివాడు వ్యక్తియైనా, నీచునితో స్నేహం తిరగడం వల్ల అతనికి అవమానమూ, అలాగే ఏదో విధంగా హాని కలగడం తప్పదు.
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more
Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more
Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more
Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more
Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more