The great vinayaka chaturthi 2013 teluguawishesh

The Great vinayaka chaturthi 2013 teluguawishesh, Hindu festival celebrated, Great Ganesha Festival, Ganesh Chaturthi is the Hindu festival celebrated, Ganesh Chaturthi / Vinayaka Chaturthi,Celebrate Ganesh Chaturthi 2013, Birthday of Lord Ganapati

The Great vinayaka chaturthi 2013 teluguawishesh, Celebrate Ganesh Chaturthi 2013

వినాయక చవితి గురించి తెలుసుకోండి

Posted: 09/07/2013 07:37 PM IST
The great vinayaka chaturthi 2013 teluguawishesh

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించు దేవుడు మన గణపతి. అన్నికార్యములకు, ముందుగా పూజింపవలసిన ప్రధమైన దేవుడు విఘ్నేశ్వరుడు. విజయానికి, చదువులకు, జ్నానానికి, దేనికైన మన గణనాథుడే దిక్కు. వినాయకుని ప్రార్ధన, పూజ అనేది చాలా పవిత్రమైనది. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగువిశేష్.కామ్ తెలుపుతోంది. వినాయకుడి ఇష్టమైన విషయాలను తెలుసుకుందాం.

గణేషుడిని గరికతో పూజిస్తే సకల లాభాలు!

వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేని పూజ విఘ్నేశ్వరుని లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితం. పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బైటికి వచ్చిన యముని తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు. ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు.

కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది మునులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.

 

బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు

వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి. 'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

 

21 పత్రాలతో పూజ ఎందుకుచేయాలి!

వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం' అంటే ‘మానవత్వా'న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ' రహస్యం. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.

 

వినాయకుడికి ఏకదంత అనే పేరు ఎందుకు వచ్చింది?

వినాయకుడికి ఒకే దంతం అనే పేరు ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాన్నీ ఎక్కువమంది గమనించి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా మీరు ఈ విగ్రహానికి ఒకే దంతం ఎందుకు ఉంది అని ఆలోచిస్తే, ఒకేదంతం గల వినాయకుడి గురించి ఇక్కడ ఉన్న కొన్ని ఆశక్తికర కధలను చదవండి. ఒకే దంతంతో కనిపించే ఏకదంతం వినాయకుడి రూపం. గణపతి యొక్క ఈ రూపం పురాణాలలోని ముద్గల పురాణంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ‘ఏకదంత' అంటే ‘ఒకే పన్ను'అని అర్ధం. ఏకదంత, వినాయకుడి 32 రూపాలలో 22 వ రూపంగా చెప్తారు. దేవుడు ఈ రూపాన్ని అహంకార రాక్షసుడైన మదాసురని నిర్మూలించడానికి ధరించాడు. వినాయకుడి ఏకదంత రూప పుట్టుకపై కొన్ని ప్రసిద్ధ పురాణ కధలు ఉన్నాయి. ఒక్కొక్కదాన్ని పరిశీలిద్దాం: పద్మ పురాణం ప్రకారం, ఒకసారి శివుని పరమభక్తుడైన పరశురాముడు శివుడిని కలవడానికి కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు, అందువల్ల వినాయకుడు పరశురాముడిని లోపలి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. పరశురాముడు హిందూ పురాణాలలో కోపానికి పేరుగాంచాడు. అందువల్ల, వినాయకుడు అతనిని ద్వారం వద్ద ఆపగానే, పరశురాముడు కోపంతో తన దండంతో దాడికి దిగాడు. ఆ గొడ్డలిని చూసి, వినాయకుడు ఇది శివుడు పరశురామునికి బహుమతిగా ఇచ్చినదని గ్రహించాడు. అందువల్ల, అతను ఆ దాడిని ఆపి తన ఏక దంతంతో ఆ గొడ్డలిని ముక్కలు చేసాడు. అందువల్ల, వినాయకుడికి ఏకదంతుడు అని పేరు వచ్చింది. తరువాత పరశురాముడు తన తప్పును తెలుసుకుని, శివుడు, పార్వతి, వినాయకుడిని మన్నించమని కోరాడు. ఇలాగే ఏకదంతుడి మీద మరో పురాణం కూడా ఉంది. ఒకసారి వినాయకుడు ఒక విందుకు వెళ్లి వస్తుండగా, అతను అనేక లడ్లను, మొదకాలను సేవించాడు. అతను పర్వతం నుండి తిరిగి వస్తుండగా, క్రౌంచ అనే పేరుగల ఎలుక, పాము ఆ దారిలో వచ్చాయి. పాముని చూసి, ఎలుక వినాయకుడి వద్ద ఆగి, పారిపోయింది. దీని ఫలితంగా, వినాయకుడి పొట్ట పగిలి తెరుచుకుంది, అన్ని స్వీట్లు బైటికి వచ్చాయి. కానీ వినాయకుడు వాటన్నిటినీ ప్రోగుచేసి తిరిగి అతని పొట్టలోకి తీసుకున్నాడు. తరువాత ఆయన ఆ పాముని తన పొట్టచుట్టూ గట్టిగ చుట్టి పట్టుకున్నాడు. ఈ సంఘటన చూసి, చంద్రుడు (చంద్ర) పెద్దగా నవ్వాడు. చంద్రుడు నవ్వడం చూసి వినాయకుడికి కోప౦ వచ్చింది. అందువల్ల, ఆయన తన ఒక దంతాన్ని విరిచి చంద్రుని మీదకు విసిరాడు, ఎప్పటికీ పూర్తిగా ప్రకాశించలేవని నిందించాడు. తరువాత చంద్రుడు క్షమాపణ కోరాడు, వినాయకుడు చంద్రుడి నుండి శాపాన్ని తొలగించాడు. అందువల్ల ఈ కారణంగా వినాయకుడు ఏకదంతుడుగా ప్రసిద్ది చెందాడు. ఈ సంఘటన కారణంగా ప్రజలు వినాయక చవితి రోజు రాత్రిపూట చంద్రుడిని చూడడానికి నిరాకరిస్తారు. వినాయకుడు, వేదవ్యాసునికి రచయితగా ఉన్నపుడు మహాభారతాన్ని రాసేటపుడు అతని దంతాలలో ఒకదాన్ని కాలంగా ఉపయోగించారని మరో కధ. ఏకదంత వినాయకుడు అతిపెద్ద పొట్ట, ముదురు రంగు, నాలుగు చేతులు, విరిగిన దంతాన్ని కలిగి ఉంటాడు. వినాయకుడి రూపంలో ఉన్న ఏకదంతుడిని పూజిస్తే, మీరు ఏ పని చేసిన విజయం సాధిస్తారు, మీ పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆయన విరిగిపోయిన దంతం అతని భక్తులు ఎలాంటి కోర్కేలనైనా తీర్చడానికి ఆయన త్యాగం చేసాడని గుర్తు. అందువల్ల, మనస్పూర్తితో ఏకదంతుడిని పూజిస్తే, ఆయన వారి కోర్కెలను నేరవేరుస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more