Ram gopal varma comments on undavalli arun kumar speech

ram gopal varma comments on undavalli, ram gopal varma comments on undavalli speech, director ram gopal varma, undavalli arun kumar speech, telangana state, telangana issue, telangana state division, jai andhra sabha meeting, samaikyandra meeting, congress party, kcr,

ram gopal varma comments on undavalli arun kumar speech

అతని మాటలకు పడిపోయిన రామ్ గోపాల్ వర్మ

Posted: 08/05/2013 09:06 PM IST
Ram gopal varma comments on undavalli arun kumar speech

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్రహ్మఱణ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ పై కొన్ని నిజాలు బయట పెట్టారు. రాష్ట్రంలో తెలంగాణలో అబివ్రుద్ది పై తాను మూడువందల పేజీల నోట్ ను తయారు చేస్తానని, విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో గత 50 ఏళ్లలో ఎవరరెంత లబ్ధిపొందారో శాసనసభలో వివరించాలన్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగానే యూపీ, మద్యప్రదేశ్ రాష్ట్రాల్లో విభజన జరిగిందని గుర్తు చేశారు. పాండిచ్చేరి తరహాలో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా చేయవచ్చని ఉండవల్లి అన్నారు. అయితే 57 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదులుకొనేప్రసక్తి లేదన్నారు. తెలంగాణ విడిపోతే దేశంలో 17 ప్రాంతాల్లో అలజడి మొదలయ్యే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ లో నివశించే వారికి తెలంగాణాలో కలవడం ఇష్టం లేదన్నారు. రాజధాని గా ఉన్న ప్రాంతాన్ని విడదీసి వేరే రాష్ట్రం ఏర్పాటు చేయడం భారత దేశంలో ఇదే ప్రథమమన్నారు. అసలు తెలంగాణ రావడం కేసిఆర్ కు ఇష్టం లేదని ఉండవల్లి అన్నారు. రక్తపాతం లేకండా తెలంగాణ రావడం కేసిఆర్ కు బాధ కలిగిస్తుందన్నారు. అయితే ఉండవల్లి మాటలపై ప్రముఖ దర్శకుడు కామెంట్ చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత రామ్ గోపాల్ వర్మ చాలా అప్‌సెట్ అయినట్లు ఆయన ట్విట్స్ పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. తెలంగాణ విషయంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగం చాలా బాగుందని, దాన్ని అంతా చూడాలని అంటున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. "తెలుగు వాళ్లను విభజించడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బిహారీ, ఓ హిందీ చేతులు కలిపారు'' అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. తెలంగాణ విషయమై కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రం విభజన పై వర్మ చాలా బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఉండవల్లి చేసిన ప్రసంగం ప్రతిఒక్కరు వినాలని చెప్పటం చాలా విశేషంగా ఉంది. అయితే త్వరలో వర్మ ఉండవల్లితో సినిమా తీసిన ఆశ్చర్యం లేదని , ఆయన అభిమానులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more