Many secrets in nature

eastern ghats of andhra pradesh, new species found on jeypore hills, gekoella jeyporensis lizard

many secrets in nature

secrets-of-nature.png

Posted: 03/26/2013 12:53 PM IST
Many secrets in nature

eastern-ghats

మనిషి విశ్వానికి ప్రతీక.  మనిషిలోను, విశ్వంలోనూ సమతౌల్యానికి తగ్గట్టుగా మార్పులు చోటుచేసుకుంటుంటాయి.  బరువులు మోసేవాళ్ళకి కండలు పెరగటం కానీ, వేదనలో ఉన్నవాళ్ళకి ఊరట కలిగించే ఆలోచనలు రావటం కానీ, ఎండలో శ్రమించేవాళ్ళకి స్వేదం ద్వారా చల్లబడటం కానీ ఇలాంటివన్నీ మానవ శరీర విధానంలో మనం చూస్తాం.  అలాగే విశ్వంలో సమతౌల్యతను కాపాడటం కోసం వివిధ రకాల జీవరాశులు ఉద్భవిస్తుంటాయి, అంతరిస్తుంటాయి.  

సాయంత్రం పూట వాన తుంపర పడ్డప్పుడు రోజంతా కాగిన భూమి మీద సెగ ఒక్కసారిగా పెరిగిపోతుంది.  ఆ రేడియేషన్ నుంచి కాపాడటానికి దీపపు పురుగులు వచ్చి ఆ వేడిని అవి తీసేసుకుని మాడిపోతాయి.  అవి ఎక్కడి నుంచి వచ్చాయో, మళ్ళీ చచ్చి ఎక్కడకు పోయాయో తెలియదు.  వర్షం పడగానే వచ్చే కప్పలు కానీ, మురికి ఉన్న చోటికి చేరే బొద్దింకలు కానీ, చెమట వలన కలిగే ప్రధూషణాన్ని తొలగించటానికి వచ్చే నల్లులు కానీ ఎలా వస్తాయో ఆ వాతావరణంలో మార్పు తీసుకునిరాగానే అలాగే వెళ్ళిపోతాయి.  అయితే వాతావరణాన్ని బట్టి ఒక రకం జీవరాశులు మాత్రమే రావు.  ఎన్నో రకాలు వస్తుంటాయి.  అందులో కొన్ని జీవరాశులు, అనవసరంగా పెరిగిపోయే జీవజాతిని ఆహారంగా చేసుకుని వాతావరణ సమతౌల్యతా నియంత్రణలో భాగం వహిస్తుంటాయి.

wild-species

పది సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉండే చిన్న గెకోయెల్లా జేపోరెన్సిస్ అని శాస్త్రఙులు పిలిచే తొండ అంతరించిపోయిన జీవరాశుల జాబితాలోకి పోయింది.  కానీ ఇటీవల కాలంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలోని తూర్పు కొండప్రాంతాలలో దాన్ని కనుగొన్న శాస్త్రఙులు సంతోషంతో కేరింతలు కొట్టారు.  జేపోర్ కొండల్లో కనుగొన్న ఈ జేపోరెన్సిస్ వీపు మీద షట్కోణపు ప్లేట్లతో ఆకర్షణీయం ఉంటుంది.  ప్రస్తుతం కనుగొన్న 190 రకాల తొండలలో ఈ గెకోయెల్లా జేపోరెన్సిస్ అనేది చాలా ముఖ్యమైన జాతని బోంబే నేచురల్  హిస్టరీ సొసైటీ లో సైంటిస్ట్ వరద్ గిరి అన్నారు.  దీన్ని కనిపెట్టటంలో శాస్త్రఙులు 135 సంవత్సరాలుగా విఫలమయ్యారన్నారు.  ఈ జాతిని కనుగొనటానికి 2008 నుంచి అన్వేషణ సాగించిన రిసెర్చ్ చేస్తున్న ఇషాన్ అగ్రవాల్, ఏదైనా కనిపెట్టాలంటే చాలా ఓపిక ఉండాలి, శ్రమకోర్చి పనిచెయ్యాలి, దానితో పాటు అదృష్టం కూడా ఉండాలి అన్నారు.  దీనితో తూర్పు కనుమలు వైవిధ్యమైన జంతుజాలానికి ఆలవాలమని అర్థమవుతుందన్నారాయన.  అందువలన ఈ వాతావరణాన్ని కాపాడటానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చెయ్యవలసి వుంటుందని కూడా అన్నారు.

lizard

ఈ తొండ 4200 అడుగుల ఎత్తున్న జేపూర్ లో పతింఘే కొండ మీద లభించింది.  జీవరాశుల ఉత్పత్తి మరణాలు చాలా నిగూఢమైన రహస్యాలు.  వాటిని ఛేదించటానికి మానవుల జీవిత కాలం సరిపోతుందా అన్నదే ప్రశ్న.  జీవరాశులను అంతరించిపోకుండా కాపాడటమనేది ప్రపంచంలో సమతౌల్యత స్థాపించటానికి ఒక మంచి మార్గమన్నది నిర్వివాదం.  జీవరాశులలో ఏది ముఖ్యం ఏది కాదు అన్నది నిర్ణయించటానికి మానవుని మేధస్సు సరిపోదు కాబట్టి అన్నిటినీ పరిరక్షించే బాధ్యతను చేపట్టే సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.

కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, కొన్ని రకాల జీవరాశులను కాపాడాలంటే వాటి అవసరాన్ని కలిగించాల్సి వస్తుంది.  మనకి బాగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, పరిశుభ్రంగా లేని వాతావరణం దోమలకు, ఈగలకు, బొద్దింకలు, జెర్రిలాంటి పాకే పురుగులకు ఆకర్షణీయంగా ఉంటుంది.  కానీ అలాంటి వాతావరణాన్ని నగరాలలో కోరుకోలేము కాబట్టి అక్కడ వాటిని సంహరించే ప్రయత్నాలు చేస్తుంటాం.  దానితోపాటు పారశుద్ధ్యానికి కూడా చోటిస్తే అటువంటి జీవరాశుల అవసరం అక్కడ ఉండకుండా ఉంటుంది.

అయితే శాస్త్రఙులు చెప్పేది జనసంచారాలుండే చోట వాటిని పెరగనివ్వమని కాదు.  భూమ్మీద చూసుకుంటే నరసంచారం లేని చోటే చాలా ఎక్కువ.  అటువంటి ప్రదేశాలలో సహజ వాతావరణంలో అక్కడున్న పరిస్థితులకనుగుణంగా జంతువులు, జీవులు పెరగటమంటే అర్థం ఆ వనాన్ని రక్షించటానికి అవతరించిన ప్రాణులు వాటిని కాపాడుతుంటాయని.  అందువలన, అటువంటి ప్రదేశాలకు పోయి జీవరాశుల జీవనానికి అడ్డురాకుండా ఉంటే అవి వాటంతట అవే పెరుగుతూ భూమిని, భూమిమీది వాతావరణాన్ని కాపాడే వనసంపదను పరిరక్షిస్తాయి.  

ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగా చెప్పే ఆచారమున్న హిందూ సాంప్రదాయంలో, నగరాలలో మడి, ఆచారం, పండుగల పేరుతో పారిశుద్ధ్యాన్ని ప్రతిపాదించి, మానవులే కాక విశ్వంలోని సర్వప్రాణులనూ సమానంగా చూడాలని, అన్నిటిలోనూ ఉన్నది ఆ బ్రహ్మమేనని, అందు వలన జీవ హింస తగదని చెప్పబడింది.  సృష్టి రహస్యాన్ని ఛేదించటం కష్టం కాబట్టి దాన్ని పరిరక్షిస్తే చాలన్న భావన కలిగి, ఆ దిశగా కృషి సలుపుతున్న విఙాన శాస్త్రవేత్తలు శ్లాఘనీయులు,

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul never said no to pm post
Actor ram charan teja gift to upasana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more