Heroes fans

movie star fans, heroes fans club, movie functions, movie audio functions, your favorite heroes, your favorite hero movies, mother and father, family, ntr, chiranjeevi, anr, krisha, tollywood movies,

heroes fans

heroes-fans.gif

Posted: 03/19/2013 01:52 PM IST
Heroes fans

heroes fans

అభిమానం హద్దులు దాటితే? ఏం చెయ్యాలి?  అభిమానం ఉండాలి.. కానీ  అయిన వారికి  అన్యాయం చెయకూడదు.  ఏ తల్లిదండ్రులకు పుత్రశోకం లేకుండా చూడాలి?  అభిమాన హీరోల కోసం వెళ్లి.. ఆపదలో  చిక్కుకొని.. అనంత లోకాలకు వెళ్లితే.. కనిపెంచిన అమ్మనాన్నల పరిస్థితి ఏమిటి?  ఓ  అభిమాని  ఒక్కసారి నిశితంగా ఆలోచించు? అభిమానం ఉండాలి? తల్లిదండ్రుల తరువాతనే  అభిమానం అనేది  తెలుసుకోవాలి.  రీసెంట్ గా జరిగిన  ఒక ఆడియో ఫంక్షన్ తొక్కిసలాటలో ఒక అభిమాని  మరణించిన విషయం తెలిసిందే. కళ్లముందు కనిపించే కొడుకు.. కాలకార్భంలో కలిసిపోతే.. ఆ తల్లి పడే బాధ అంత ఇంత కాదు.  ఆ కుటుంబానికి ఎన్నికోట్లు ఇచ్చిన  .. ఆ తల్లిదండ్రుల బుణం తీర్చుకోలేం.  ఆ తల్లి కొడుకు ముందు ఎన్నికోట్లైన దిగతూడుపే.  అభిమానం అనేది గుండెళ్లో ఉండాలి కానీ, అది కన్నవారికి కన్నీరుగా మిగిలిపోకూడదు. ఏరంగంలో ప్రముఖుడైన వారిని అభిమానించడం మామూలే. అందునా సినిమా హీరో అంటే కాస్త హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ అభిమానం ఎలా ఉండాలి? దాన్ని హీరోలు ఏ కోణంలో చూడాలి? అనేది గ్రహించాలి. ఒక హీరో రోడ్డుమీద పోతుంటే... దారినపోయేవారి అతన్ని చూడాలనుకోవడం వారిని కంట్రోల్‌ చేయడం ఒక ఎత్తు. కానీ భారీ ఫంక్షన్‌ ఏర్పాటు చేసి అక్కడ నియంత్రించడం మరోఎత్తు. సినిమా రిలీజ్‌రోజు థియేటర్లలో అభిమానులు తమ వీరత్వాన్ని చూపిస్తుంటారు. టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో ఒకరితర్వాత ఒకరు తీసుకోవాలనే నిబంధన ఉంటుంది. అయినా... మొదటిరోజు మొదటి ఆటచూడలేక పోతామోనన్న ఆదుర్దా, తొందరపాటు తనంలో సింగిల్‌లైన్‌ ఉన్న మార్గంలో పైకి ఎక్కి జనాలపైనుంచి వెళ్ళి తోపులాటలతో ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు అగ్రహీరోల చిత్రాల్లో చాలా జరిగాయి. ఇలా జరగడానికి కారకులు ఎవరు? థియేటర్ల నిర్వాహకులదా? అభిమానంతో తొందరపడిన వారిదా? రెండింటిని వేరుగా చూడలేం. ఆమధ్య  చిత్తురు  జిల్లాలో జరిగిన  సంఘటన ఓ అగ్రహీరో సినిమా విడుదలనాడే తెల్లారిజామున థియేటర్‌ లైన్‌లో నుంచున్న అభిమాని షార్క్‌సర్క్యూట్‌వల్ల చనిపోయిన ఘటన జరిగింది. 

heroes fans

 

సినిమా ఫంక్షన్లు జరిగేటప్పుడు అభిమానులు నియంత్రించడం నిర్వాహకులకుపోలీసు యంత్రాంగానికి చాలా కష్టంతోకూడిన పనే. అందుకే నిర్వాహకులు ప్రణాళికబద్ధంగా ఫంక్షన్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఇటీవలే మహేష్‌వెంకటేస్‌ నటించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లుఆడియో వేడుక నానక్‌రామ్‌గూడాలో జరిగింది. అప్పుడే చాలామంది ఇబ్బందిపడ్డా.. ఎటువంటి నష్టం జరగకపోవడంతో... విశాలమైనఆకర్షణీయమైన స్టేజీ ఇండిస్టీలో పలువురు హీరోలను ఆకర్షించింది. ఆ వెంటనే ప్రభాస్‌ నటించిన 'మిర్చివేడుక జరిగింది. ఆనాడు కృష్ణంరాజు అభిమానులకు చేదు అనుభవంకూడా ఎదురైంది. ఓ దశలో అభిమానులు చేసిన అల్లరికి కుర్చీలు విరిగిపోయాయి. ఇలా నా అభిమానులు చేయరని కూడా కృష్ణంరాజు స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సివచ్చింది. అటువంటి అనుభవం జరిగిన తర్వాత మళ్ళీ అక్కడే 'బాద్‌షావేడుక జరపాలనుకోవడం ఇండిస్టీ పెద్దలను ఆశ్చర్యపర్చింది. ఇది నిర్వాహకుల లోపంగా వారు విశ్లేషిస్తున్నారు.  ఇలాంటి చోట్లకు అభిమానులు రావడంగోల చేయడంఎవ్వరి మాటా వినకపోవడం అనేది మామూలే. అయితే అలాంటి సమయంలో నిర్వాహకులుపోలీసు యంత్రాంగం ఎం చేయాలనేది ప్రశ్న తలెత్తుతుంది. అగ్రహీరోకు అభిమానులు ఎక్కువైతే విశాలమైన ప్రాంగణంలో జరపాలి. నానక్‌రామ్‌గూడాలో ఆ వెసులువాటు లేదు. కేవలం మెయిన్‌రోడ్డు నుంచి 20ఫీట్స్‌ ఉన్న రోడ్డుగుండా లోపలికి ప్రవేశించాలి. అక్కడ సరైన పార్కింగ్‌ సదుపాయంకూడా లేదు. ఆ రోడ్డుగుండానే రింగ్‌రోడ్డుకు మార్గం ఉండడంతో ట్రాఫిక్‌ రద్దీగా ఉంటుంది. మామూలు రోజుల్లోనే సాయంత్రం 6 గంటలైయితే విపరీతమై ట్రాఫిక్‌ జామ్‌ ఉండే ప్రాంతంలో ఏకంగా వేలాదిమంది తరలివచ్చే సినిమా ఫంక్షన్స్‌కు ఎంచుకోవడం ఆశ్చర్యం కల్గించింది.  అసలు ఫంక్షన్స్‌ ఎక్కడ జరాగాలి. అభిమానులు ఒకరోజు ముందుగానే వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తారు. వారికి కనీస సౌకర్యాలుకూడా ఉండవు. అయినా కష్టపడి వచ్చిన వారిని చూడటంఆనందించటం మామూలే. అలాంటప్పుడు వారికి కనీససౌకర్యాలు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఫంక్షన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

heroes fans

అసలు ఈ అభిమానుల సందడి ఇప్పటిది కాదు. లోగడ ఎన్‌.టి.ఆర్‌ఎ.ఎన్‌.ఆర్‌. చిత్రాల వేడుకల్లోనూ ఇటువంటి జరుగుతున్నవే. కృష్ణ నటించిన 'సింహాసనంచిత్రం ఫంక్షన్‌ అప్పట్లో మద్రాసులో జరిగింది. పోలీసు కమిషనర్‌ నుంచి కృష్ణ పర్మిషన్‌ తీసుకున్నారు. ఆంధ్రప్రవేశ్‌నుంచి మద్రాసుకు రావడం తక్కువ అని ఆనాడు ఆయన భావించారట. కానీ ఫంక్షన్‌నాటికి వేడుకజరిగే ప్రాంతానికి 12 కి.మీ. దూరం వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అందులో నటించిన జయసుధమందాకినీ వంటివారు రావడానిక్కూడా వీలులేకపోయింది. ఇందుకు ఎవర్ని నిందించాలి. ఇలాంటిదే ఒకప్పుడు చిరంజీవి వేడుక గుంటూరులో జరిగితే బైపాస్‌రోడ్డంతా ఉక్కిరిబిక్కిరయింది.బాద్‌షా చిత్ర వేడుకలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. ఎవరికివారు చెల్లాచెదురై పోయారు. ఒక అభిమాని చనిపోతే అక్కడే ఉన్న ప్రముఖుల్ని ప్రశ్నించడంకానీఆవేశంతో తిరుగుబాటు చేయడం కానీ చేయలేదు. ఇలాంటివి జరిగితే.. నిర్వాహకులు భయపడి ఇటువంటి ఫంక్షన్స్‌ పెట్టకపోవచ్చు. పెట్టినా సరైన చర్యలు తీసుకోవచ్చు. అభిమానులుకూడా మేల్కొనాలి. ఇప్పుడు అనేక కార్యక్రమాల్ని మీడియాఇంటిముందుకు తెస్తోంది. క్రికెట్‌మ్యాచ్‌ వస్తే దాన్ని దగ్గరగా చూడలేనివారికి లైవ్‌ క్రికెట్‌ అవకాశం వుంది. రోడ్లపై ఎక్కడ ఏ షాపులో చూసినా అభిమానులు పనులుమానుకుని మరీ చూస్తుంటారు. అలాంటిది హీరోల ఫంక్షన్లు జరిగే సమయంలో వాటిని నేరుగా ప్రసారం చేసే ఛానళ్లు ఉన్నాయి. ఇంటి దగ్గరే హాయిగా కూర్చొని తిలకించవచ్చు. ఉన్న వసతిని ఉపయోగించుకుండా ఎక్కడికో వెళ్ళిచూడాల్సిన అవసరం ఏంటని ఎవరికివారు ఆలోచించుకోవాలని సినీ పండితులు ప్రశ్నిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dmk pulls out of upa chidambaram says govt stable
Agustawestland helicopter scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more