Nagma recommended for rajya sabha seat

Nagma, heroine ngama, nagma, chiranjeevi, gharana mogudu,

According to Congress sources, Nagma, 38, had earlier asked the Congress high command for a Lok Sabha ticket from Mumbai and northern states in 2009. Though denied a ticket then, she campaigned for party candidates in Mumbai and Hindi-Bhojpuri heartland

Nagma recommended for Rajya Sabha seat.png

Posted: 12/30/2012 10:56 AM IST
Nagma recommended for rajya sabha seat

Nagma

నగ్మా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ పేరు వినగానే నరాలు జివ్వుమనేవి. తెలుగులో మంచి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈమెను ఆ తరం వారు అంత ఈజీగా మరచిపోరు. ఇక ఈమె గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి సినిమాల్లో కనిపించడం లేదు. సినిమాల్లో తన అంకం ముగిసిన తరువాత రాజకీయల్లో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నగ్మా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. అయితే ఈమె గతంలోనే రాజకీయ అరంగ్రేటం చేయబోతుందని, 2009లోనే లోక్ సభ అభ్యర్థిగా భరిలో దిగుతుందని ప్రచారం సాగినా అది జరగలేదు. ఇప్పడు మళ్లీ నగ్మా పేరు తెర పైకి వచ్చింది. మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ మరణం తరువాత ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు జనవరి 12 ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈమెను రాజ్యసభకు కాంగ్రెస్ తరుపున పంపేందుకు కొందరు మహారాష్ట్ర నాయకులు పావులు కదువుతున్నట్లు సమాచారం. ఇంత వరకు బాగానే ఉన్నా.... ఈమె కోసం పలువురు పోటీ పడటంతో కాంగ్రెస్ లో విభేదాలకు తెరలేచే ప్రమాదం ఉందని అంటున్నారు. విలాసరావ్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ సన్నిహితుడైన కాంగ్రెస్‌ నేత రోహిదాస్‌ పాటిల్‌ పేరును తెరపైకి తెచ్చారు.

ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా నగ్మా పేరును సిఫార్సు చేయడంతో కాంగ్రెస్‌ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఈ పదవి కోసం ఆ రాష్ట్రం నుంచి రోహిదాస్‌ పాటిల్‌తో పాటు విదర్భలోని కాంగ్రెస్‌ నేత నరేశ్‌ పుగాలియా, మాజీ మంత్రి అనీస్‌ అహ్మద్‌లు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం నగ్మా అభ్యర్థిత్వం కోసం ఢిల్లీ స్థాయిలో కొందరు నేతలు అధిష్టానానికి సిఫార్సు చేస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మోహన్‌ ప్రకాశ్‌ కూడా నగ్మా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు సమాచారం. నగ్మాది గుజరాత్‌ కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ మద్దతు లభించే అవకాశాలున్నాయి. నగ్మాకు అభ్యర్థిత్వం కట్టబెడితే గుజరాత్‌, మహారాష్ట్రలోని ముస్లిం సమాజంలోని మహిళకు కాంగ్రెస్‌ ప్రాధాన్యమిచ్చినట్లు సందేశం ప్రజల్లోకి వెళ్తుందని, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నగ్మా చరిష్మా ఉన్నందున దక్షిణాది ఓటర్ల మద్దతు ఉండొచ్చని అధిష్ఠానం దృష్టికి కొందరు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి నగ్మా కోసం కాంగ్రెస్ నాయకులు కుమ్ములాటలు చేసుకుంటున్నారని, ఆమె అంటే ఆ నాయకులకు ఎంత ఇదో అని అక్కడి వారు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha distanced from ys jagan
Delhi rape victim amanth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more