Happy diwali festival 2012

happy diwali 2012, festival of lights, Indian Festival of Lights, diwali 2012 calendar, ates, Lakshmi Puja, Diya Lamps, Rangoli, 5 Days of Diwali., 3 days of diwali, diwali greeting,diwali in india, diwali festival 2012, diwali india, diwali festival, happy diwali 2012 !

Happy Diwali festival 2012

Diwali.gif

Posted: 11/12/2012 04:24 PM IST
Happy diwali festival 2012

Happy Diwali festival 2012

ఆసేతు హిమాచలం పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది. మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.భారతదేశం అంతటా హిందువులందరూ సమైక్యంగా ఆనందోత్సహాలతో జరుపుకునే పర్వదినాలలో దీపావళి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికీ ఏదో ఒక పరమార్థం వుంటుంది. 'దీపావళి' పండుగకు కూడా పారమార్థికం గాను, ఐతిహాసికంగాను, చారిత్రకంగాను, శాస్త్రీయంగాను ఒక విశిష్టత ఉంది. ఈ విశేషాలను తెలుసుకోవడానికి మన ప్రాచీన వ్రత గ్రంథాలు, పురాణాలు, ఇతర సాహిత్య గ్రంథాలు తోడ్పడుతున్నాయి.

''దీపావళి'' మూడు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీపావళి అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి అనే ఈ మూడు రోజులూ జరుపుకునే పండుగే 'దీపావళి'. ఆశ్వయుజ బహుళ చతుర్దశి దినాన్ని ''నరకచతుర్దశి'' గాను, రెండవనాటి అమావాస్యను ''దీపావళి అమావాస్యసగాను మూడవనాడు కార్తీక శుద్ధపాడ్యమిని 'బలి పాడ్యమి' గాను యావద్భారతదేశం అంతటా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఉత్తర భారత దేశంలో ఇది ఐదు రోజులపండుగ. ''ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమ ద్వితీయ'' అని 'దీపావళి' ని అయిదు రోజులు అత్యంత వైభవో పేతంగా ఆచరిస్తారు.

Happy Diwali festival 2012

ఈ ఐదు రోజులకు ఈ పేర్లు ఎలా సార్థకమయ్యాయో, ఆయా రోజుల విశిష్టతను మన ప్రాచీన వ్రత గ్రంథాలు, పురాణాలు, ఐతిహ్యాలు తెలియజేస్తున్నాయి.

నరకచతుర్దశి నామౌచిత్యం- వైశిష్ట్యం

'నరక చతుర్దశి' అనే పదం లోని 'నరకము' నకు 'యమలోకం' అని అర్థం ఉంది. దాని నుండి విముక్తి చెంద డానికై ఈ ఉత్సవం చేయాలని 'వ్రత చూడామణి'లో ఉంది. 'నరకమనగా మురికి' అని, కార్తీక మాసంలోనే సూర్యుడు తులారాశియందు చేరునని, దానివలన రాత్రులు దీర్ఘమగునని, ఈ నరకాన్ని పరిశుభ్రపరచడానికి ఇదే అదనని' చెప్పబడుతుంది.

నరక విముక్తి

'నరక చతుర్దశి' అను పదంలోని 'నరక' విముక్తి కొరకు ఏఏ కార్యాలను ఆచరించాలో మన పురాతన వ్రత గ్రంథాలు విశదీకరిస్తున్నాయి. 'హేమాద్రి, నిర్ణయామృతం, భవిష్యోత్తర పురాణాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది.

'కార్తీక కృష్ణ చతుర్దశ్యాం ప్రభాతే చంద్రోదయే అభ్యంగనం కుర్వాత్‌'

'కార్తీక కృష్ణచతుర్దశియందు ఉదయమే చంద్రోదయ సమయంలో నరకభయం కలవారు అభ్యగస్నానం చేయాలి' అలాగే ఈ విషయాన్ని గురించి 'చంద్రోయము' నందు పృధ్వీయందు, పాద్మమునందు 'కాలాధర్మము నందు' ప్రస్తావించడం జరిగింది. స్మృతిదర్పణంలో కూడా ఈ విషయం ఉంది.

ఈ గ్రంథాలలో ఇంకా ఏమన్నా రంటే

'తైలే లక్ష్మీర్జలే గంగా దీపావ ల్యాశ్చతుర్దశీమ్‌ ప్రాప్యేతి శేషః ప్రాతః స్నానంతు యమః కుర్యాద్యమ లోకం నపశ్యతి'

నరకచతుర్దశి రోజు తైలమందు లక్ష్మి నీటియందు గంగ ఉండునని, ఈ రోజు ప్రాతః స్నానం చేసినట్లయితే యమలోకం చూడడం జరగదని పేర్కొన్నారు. అలాగే నరరక్షయం కొరకు ఉత్తరేణు కొమ్మను శిరస్సు చుట్టూ స్నానసమయంలో తిప్పాలి' అలా తిప్పితే సమయంలో

'సీతాలోష్ఠసమాయుక్తం సకంటక దలాన్విత

హరపాపమపామార్గ భ్రామ్యమాణః పునః పునః

అని పఠించాలి. అని మదన రత్నాపాద్మము' నందు ఉంది. అంతే కాకుండా.

అస్యాయేవ ప్రదోపే దీపాన్‌ దద్వాత్‌' అని హేమాద్రి యందు ఉంది. స్కాందపురాణంలో.

'తతః ప్రదోషసమయే దీపాన్‌ దద్వాత్‌ మనోరమా'న్‌ అని పేర్కొన్నారు.'బ్రహ్మవిష్ణు శివాదీనాం భవనేషు మఠేఘచ' అని దివోదాసీ నము, బ్రహ్మపురాణాలలో చెప్పబడింది. ఈ శ్లోకాల సారాంశం ఏమంటే.

ఈనాటి సాయంకాలం దేవాలయాలందు, మఠములందు దీపాలు పెట్టాలి' అని హేమాద్రి, స్కాందపురాణాలలో చెప్పారు. అమావాస్యనాడు చతుర్దశి సాయంకాలం సమయంలో దీపాలు పెట్డడం వల్ల యమభటులనుంచి విముక్తి కలుగుతుందని 'దివోదాసీయమందు, బ్రాహ్మ మునందు' చెప్పబడి ఉంది. 'బ్రహ్మపురాణం'లో ఇంకా ఏం చెప్పారంటే

'అమావాస్యా చతుర్దశ్యోం ప్రదోషే దీపదాసతః

యమమార్గాధికారే భ్యోముచ్యతే కార్తికేనరః'

'నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో దీపదానం చేయాలని, సర్వపాప పరిహారార్థం కొరకు ప్రీతి కొరకు (యముని ప్రీతికొరకు) దీప దానం చేస్తున్నానని'' ఈ మంత్రం పఠించాలి.'నరక చతుర్దశి' అనే పేరు ఈ రోజుకు రావడానికి ఐతిహాసాలు, కథలు కూడా ఉన్నాయి. అటువంటి కథలలో 'సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసుని వధించిన ఇతివృత్తం', 'బలి చక్రవర్తి వృత్తాంతం'గా పేర్కొనడం జరిగింది. 

Happy Diwali festival 2012

నరకాసుర వృత్తాంతము

విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రమున ప్రవేసించి, ఆ రాక్షసుడిని చంపి, భూమిని మరల పైకి తీసుకువచ్చాడు. ఆ సమయమున వరహా అవతారముననున్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణ్డువు తాను త్రేతాయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలుపాడు.త్రేతాయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినపుడు, భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారము చేయవలెనని ప్రమాణము చేయించుకున్నది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమరుని పెంచి, నరకుడని నామమునిచ్చి విద్యా బుద్ధులను నేర్పించాడు. నరకునకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగాతీరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి అయుధాన్ని, దివ్య రధమును అనుగ్రహించి, కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరము రాజధానిగా పాలించుకొనుమని చెప్పి భూదేవితోగూడి అదృశ్యమయ్యాడు.

Happy Diwali festival 2012

నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపరయుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్టులవారు "నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అవమానించుతున్నావు. నీ జన్మదాత చేతనే మరణించెదవు" అని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణములేకుండునట్లు వరమును పొందాడు. ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు.వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించగా, ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామాదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు రోజులు ప్రజలు ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee upset with rumours
Kiran govt with mim support withdraw  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more