Sumathi Satakam in Telugu 42559 Sumathi Satakalu

Sumati shatakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu తన కలిమి యింద్రభోగము

Get the Sumathi Satakam ప్రతివారికీ నేను అనేది ఒకటి ఉంటుంది. అదేమిటో తెలియకపోయినా, నేను, నాది అని వ్యవహరిస్తుంటారు. ప్రపంచమంతా తనతోనే ఉంది, తనకోసమే ఉందన్నట్టుగా ఉంటుంది చాలా మంది భావన. మనం పుట్టక ముందూ ఈ జగత్తుంది, మనం పోయిన తర్వాతా ఉంటుంది. కేవలం ఇక్కడ ఉన్నంతకాలమే నేను, నాది అనేది. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం

Posted: 02/26/2013 02:12 PM IST
Sumati shatakam

తన కలిమి యింద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ

సుమతీ శతకంలోని ఇతర వాక్యాలలాగానే, ఈ పద్యంలోని నాల్గవ పాదాన్ని కూడా ఎంతోమంది రచయితలు తమ రచనల్లో వాడుకున్నారు.  ఇష్టపడ్ఢ వారిలో అందం కనిపిస్తుంది.  అందుకే కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు.  ప్రేమ కలిగినప్పుడు ఎదుటి వారు అందంగా కనిపిస్తారు.  ఆమెలో ఏం చూసావురా అని పెద్దలు, స్నేహితులు అడిగినా ప్రేమికుడు చెప్పలేడు.  ఎందుకంటే అది కంటితో చూసే అందం కాదు.  మనసుతో చూసేది.  మనసుకి నచ్చినది ఎప్పుడూ ప్రేమపాత్రమే అవుతుంది. 

పద్యంలోని మిగతా పదాలలో మరో కోణం కనిపిస్తుంది.  అదే అసలైన, మౌలికమైన అర్థం. 

ప్రతివారికీ నేను అనేది ఒకటి ఉంటుంది.  అదేమిటో తెలియకపోయినా, నేను, నాది అని వ్యవహరిస్తుంటారు.  ప్రపంచమంతా తనతోనే ఉంది, తనకోసమే ఉందన్నట్టుగా ఉంటుంది చాలా మంది భావన.  మనం పుట్టక ముందూ ఈ జగత్తుంది, మనం పోయిన తర్వాతా ఉంటుంది.  కేవలం ఇక్కడ ఉన్నంతకాలమే నేను, నాది అనేది. 

కలిగివున్నంతకాలం ప్రపంచమంతా రంగులమయంగా కనిపిస్తుంది.  కలిమిపోయి ఆర్థిక, లేక ఇతర ఇబ్బందులు కలిగినప్పుడు ప్రపంచమంతా దారిద్ర్యంతో నిండిపోయినట్టుగా అనిపిస్తుంది.  తనకి కలిగిన శారీరక బాధలు, ఆసన్నమైన మరణం వలన ప్రపంచమే ఆగిపోతుందనిపిస్తుంది.  అలాగే నాకు నచ్చింది కాబట్టి ఫలానా ఆమె చాలా అందగత్తె అనే భావన కలుగుతుంది.  అదే మాయ.  మాయా ప్రభావం వలనే మనిషి తనను తాను విశ్వంలో కేంద్ర స్థానంలో చూసుకోవటం జరుగుతుంది.  ఈ భావన తొలగిపోయి కోటి సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా నడుస్తున్న ఈ విశ్వంలో నా జీవిత కాలం చాలా చిన్నది అని, కోటానుకోట్ల జీవరాశులలో, మానవులు ఎంత, అందులో నేను ఎంత అని అనుకున్నప్పుడు ఇతరులతో సహ జీవనం అనివార్యమని అర్థమైనప్పుడు, అందరూ నాలాగే ప్రకృతిలోని అంశలు అనే సత్యం గోచరించినప్పుడు భేద భావాలు కక్షలు కార్పణ్యాలు అంతరించిపోతాయి.  సర్వ మానవ ప్రేమ ఒక్కసారే కలుగక పోయినా ముందుగా సహనం, ఓరిమి, శాంతం అబ్బుతాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati shatakam
Sumati shatakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more