(Image source from: hamsa nandini reduces her remuneration for gopichand movie)
హీరోయిన్ గా చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోదామని ఎంట్రీ ఇచ్చిన చాలామంది భామల్లో కొంతమంది సైడ్ క్యారెక్టర్స్ పాత్రలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఐటమ్ గాళ్స్ గా స్థిరపడిపోయారు. ఈ తరహాలోనే హంసానందిని కూడా హీరోయిన్ అవుదామని టాలీవుడ్ కి ఎంట్రీ అవకాశాలకోసం ఎన్నో కష్టాలు పడినా ఆమెకు ఆపర్లు దక్కకపోవడంతో చివరకు ఐటం సాంగ్ లకు సై అంటూ ఒప్పుకుంది. అప్పుడు ఆమె ఒప్పుకున్న ఆ ఒక్క ఐటం సాంగే ఇప్పుడు ఈమెను టాప్ లెవెల్ కి తీసుకెళ్లింది.
కేవలం టాలీవుడ్ లోనే కాదు... యావత్తు దక్షిణాది భారతచిత్రపరిశ్రమలోనే హంసానందిని టాప్ ఐటం గాళ్ గా ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే... ఇంతవరకు ఈమె డాన్స్ చేసిన ప్రతి సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం! దీంతో ఈమెను తమ సినిమాల్లో ఐటంగాళ్ గా నటించాల్సిందేనంటూ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీనినే అదునుగా భావించిన ఈ భామ... భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని చెబుతున్నారు. ఒక్కొక్క ఐటం సాంగ్ కు దాదాపు 50 లక్షలవరకు వసూలు చేస్తోందని చెప్పుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ అమ్మడు తనకిష్టమైన హీరో కోసం కొంతవరకు రెమ్యునరేషన్ ని తగ్గించుకుందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ముందుగా దర్శకనిర్మాతలు ఈమెను తమ సినిమాలో ఓ ఐటం సాంగ్ చేయాలని కోరుకుంటే.. దానికి జవాబుగా ఓకే అని చెప్పిన ఈ భామ... 50 లక్షలకంటే తక్కువ ఇస్తే రానని పట్టుపట్టిందట! దీంతో ఖంగుతిన్న సదరు నిర్మాత ఈమెతో ఎంతసేపటికీ బేరసారాలు ఆడినా ససెమిరా అంది. చివరకు అతను గోపీచంద్ మూవీ అని చెప్పగానే వెంటనే 10 లక్షల రూపాయల వరకు తన రెమ్యునరేషన్ తగ్గించేసిందట!
ఈ విషయంమీద మొదట హర్షం వ్యక్తం చేసిన నిర్మాత... తరువాత ఎందుకు తగ్గించావు అని ప్రశ్నిస్తే... దానికి ఆమె ‘‘నాకు గోపీచంద్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో ఐటం సాంగ్ చేయడం నా అదృష్టం’’ అని జవాబిచ్చిందని చెబుతున్నారు. ఆయనతో కలిసి హీరోయిన్ గా నటించాలనే కోరిక వుందని, అయితే ఇంతవరకు ఆ అవకాశం రాలేదని ఆమె మనసులోని భావాలను వ్యక్తం చేసిందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. అయితే హీరోయిన్ గా అవకాశం రాకపోయినా.. అతనితో కలిసి డాన్స్ చేస్తున్నందుకు నా అదృష్టం అని చెప్పుకుంటూ... ఏకంగా పదిలక్షల వరకు రెమ్యునరేషన్ ని తగ్గించేసిందని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more