Another low pressure in Bay of Bengal ఏపీకి మరో ముప్పు.. బంగాళాఖాతంలో మరో వాయుగుండం

Low pressure in bay of bengal heavy rains likely in north coastal districts of andhra

Low pressure in Bay of Bengal, IMD Amaravati forecast, Heavy rainfall alert, Met Office Visakhapatnam, north coastal region, Srikakulam, Vizianagaram, Visakhapatnam, Alluri Sitarama Raju, East Godavari districts, Andhra Pradesh weather, Bay of Bengal, Low Pressure, Andhra Pradesh storm, Andhra Pradesh rainfall, AP rain news, AP latest updates, AP news

The Met office has warned of heavy rain in north coastal Andhra over the next four days due to the likely formation of a low pressure area over Bay of Bengal. A cyclonic circulation has formed over the east-central Bay of Bengal in the morning. Under its influence, a low-pressure area is set to take shape over the northwest part of the embayment around Tuesday, according to a bulletin by the Met office.

ఆంధ్ర ప్రదేశ్ కు పోంచివున్న మరో ముప్పు.. బంగాళాఖాతంలో మరో వాయుగుండం

Posted: 09/19/2022 11:14 AM IST
Low pressure in bay of bengal heavy rains likely in north coastal districts of andhra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున్న తూర్పు-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల అవర్తన ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావం చేత ఈ నెల 20వ తేదీ (మంగళవారం) నాటికల్లా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నదని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక ఈ ఐదు జిల్లాల పరిధిలో అక్కడక్కడ పిడుగులు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండాలని అధికారులు సూచన జారీ చేశారు. ఎగువ వాయుగుండం ఏర్పడుతుందని, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతిలోని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ కరుణసాగర్ తెలిపారు.దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అయితే, ఈ వర్షాల తీవ్రత మరో 24 గంటల్లో వెల్లడవుతుందని డాక్టర్ కరుణసాగర్ తెలిపారు. ఇలాఉండగా, ప్రైవేట్ వెబ్‌సైట్ స్కైమెట్ నివేదిక ప్రకారం, దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వాన కురిసే అవకాశం లేదు. ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, కేరళలో రానున్న రోజుల్లో అతి తక్కువ వర్షాలు కురుస్తాయి. వర్షపాతం స్వల్పంగానే ఉంటుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కొంత పెరుగవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles