Row over 'Rashtrapatni' remark on President కాంగ్రెస్ నేత ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఉభయసభలు..

Row over rashtrapatni remark on president bjp says sonia gandhi must apologise

Parliament mansoon sessions, Rashtrapatni, Adhir Ranjan Chowdhury, Congress, BJP, President of India, Draupadi Murmu, Smriti Irani, Sonia Gandhi, Nirmala Sitharaman, Inflation, GST, Rupee value, Lok Sabha, Rajya Sabha, National Politics

The Congress lawmaker landed himself in a soup when he referred to the Indian President, who is the first tribal woman to occupy the top post, as "Rashtrapatni." The Congress leader Adhir Ranjan Chowdhury, however, brushed aside the criticism calling it a 'slip of the tongue' as he said that the government can hang him if they want for the simple mistake.

కాంగ్రెస్ నేత ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఉభయసభలు..

Posted: 07/28/2022 05:28 PM IST
Row over rashtrapatni remark on president bjp says sonia gandhi must apologise

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. రాష్ట్రపతిపై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లోక్‌సభలో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో గళం వినిపించారు. అటు రాజ్యసభలోను ఈ వ్యాఖ్యలపై బీజేపి నిరసన తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తక్షణం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు కోరాలని బీజేపి డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పదవిలో ఉన్న గిరిజన మహిళను కాంగ్రెస్ కావాలనే అవమానించిందని బీజేపి అరోపించింది.

ధరాఘాతం, దిగజారుతున్న రూపాయి. జీఎస్టీల బాదుడు.. ప్రజలకు అందించాల్సిన సబ్సీడీల ఉపసంహరణ ఇత్యాధి అంశాలకు వ్యతిరేకంగా విపక్షాలు ధర్నాకు దిగాయి. ఈమేరకు నిరసన తెలిపిన విపక్షాలు బుధవారం రోజున రాష్ట్రపతి భవన్ కు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని కార్యక్రమాన్ని రూపోందించాయి. అంతకుముందు రోజు కూడా ఇదే విధమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా దానిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దీంతో బుధవారం కూడా భగ్నం చేస్తారా.? అయితే మీరెలా వ్యవహరిస్తారు.? అంటూ మీడియా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీని ప్రశ్నించింది. దీంతో స్పందించిన అధీర్ రంజన్ నోరుజారారు.

రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్‌ అవమానించిందని.. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఇంతకన్నా ఏం చేసిందని.. గిరిజనులను, అదివాసీలను అవమానించడం తప్ప.. అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామణ్, స్మృతిఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు. సోనియా గాంధీ తమ పార్టీ సీనియర్ సభ్యుల పట్ల సభలో దగ్ధత స్వరంతో తవ్రంగా మండిపడ్డారని.. ఇది కూడా సభ్యులను అవమానించడమేనని అన్నారు.


కాగా, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని చెప్పిన అధిర్‌ రంజన్‌.. అయితే అవి కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని.. నోరుజారి తప్పుగా వచ్చిన వ్యాఖ్యలు మాత్రమేనని అన్నారు. తాను నోరుజారి ఒక్కసారి చేసిన వ్యాఖ్యలను బీజేపి నేతలు పలుమార్లు ఉచ్చరించి.. వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. అప్పటికీ ఈ అంశం చల్లారక పోవడంతో ‘తన ‍వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్‌ రంజన్‌ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles