India Records Over 20,000 New Covid Cases దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు, తెలంగాణలోనూ అధికం

Coronavirus pandemic update 20 557 fresh covid 19 cases 102 more deaths in india

Coronavirus, Health ministry, New Infections, Covid-19 India News, Covid-19 india update, Covid-19 india cases, Coronavirus Vaccination, Telangana

With 20,557 fresh cases reported in a day, India's Covid-19 tally has climbed to 4,39,59,321, while the count of active cases of the infection has jumped to 1,46,322, the Union health ministry said on Thursday. The death toll due to the viral disease has gone up to 5,26,212 with 102 more fatalities, according to the ministry's data.

దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు, తెలంగాణలోనూ అధికం

Posted: 07/28/2022 11:51 AM IST
Coronavirus pandemic update 20 557 fresh covid 19 cases 102 more deaths in india

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదయ్యాయి. క్రితంరోజున 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య గడిచిన 24 గంటల వ్యవధిలో 20,557కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,39,59,321కి చేరింది. ఇందులో 4,32,86,787 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,211 మంది మరణించారు. మరో 1,46,323 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 44 మంది మరణించారు.

19,216 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 203.21 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇక బూస్టర్ డోసులను కూడా ఆరోగ్యశాఖ అధికారులు ముమ్మరంగా అందిస్తున్నారని తెలిపారు. ఆజాదీ కా అమృత్ వార్షికోత్సవాల సందర్భంగా జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా అందరి పెద్దలకు కరోనా వాక్సీన్ ఉచితంగానే వేస్తున్న విషయం తెలిసిందే.

కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 5.18 శాతానికి పెరిగిందని ప్రకటించింది.  తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 852 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ తో కూడిన మూడవ దశ తరువాత రాష్ట్రంలో ఇన్ని కేసులు ఒక్కరోజునే నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 36,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 852 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 4,915 మంది రోగులు ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నది. 640 మంది కరోనా నుంచి కోలుకొన్నారని, రికవరీ రేట్‌ 98.89శాతంగా ఉన్నదని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles