దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక ఘట్టానికి తెరలేచింది. పెను సంచలనంగా మారిన ఈ కేసులో నత్తనడకన దర్యాప్తు సాగుతుందని పోలీసులు విమర్శలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుల గుర్తింపు ప్రక్రియ (టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్)ను నిర్వహించారు. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను చంచల్ గూడ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు.
న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను అమె గుర్తుపట్టారు, అక్కడి నుంచి సైదాబాద్‌లోని జువైనల్ హోంకు తీసుకొచ్చి ఐదుగురు మైనర్ బాలుర గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. నిందితులందరినీ మైనర్ బాలిక గుర్తించింది. బాధితురాలు తెలిపిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. మరోవైపు అత్యాచారం కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారి డీఎన్ఏ సేకరించడానికి అనుమతివ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, అందుకు అనుమతి లభించింది. నిందితుల డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు.
అత్యాచారం జరిగిందని పోలీసులు చెబుతున్న ఇన్నోవా వాహనంలో క్లూస్ టీం ఇప్పటికే పలు ఆధారాలు సేకరించింది. డీఎన్ఏ నివేదికతో ఇన్నోవా వాహనంలో దొరికిన ఆధారాలను పోల్చనున్నారు. నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారని పక్కాగా నిరూపించడానికి పోలీసులకు డీఎన్ఏ నివేదిక ఎంతో కీలకం కానుంది. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించేందుకు కోర్టు అనుమతి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మైనర్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నిందితులు విదేశాలకు పారిపోకుండా ముందస్తు జాగ్రత్తగా వారి పాస్‌పోర్టులను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more