Mahindras' epic reply about qualification wins Internet నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్ర చమత్కార బదులు..

Man asks anand mahindra about his qualification industrialist s epic reply wins internet

anand mahindra, anand mahindra post, anand mahindra twee picst, anand mahindra, Anand Mahindra, Automobile, Twitter, Viral Tweet, Qualification, Epic reply, Experience, Merit, Vaibhav SD, Industrialist, viral news

While most of them had wonderful things to say about his latest motivational post, a user in the comments section asked about Anand Mahindra’s qualifications. Of course, his epic response won the internet's heart all over again. Anand Mahindra had an epic response to this Twitter user’s query. “Frankly, at my age, the only qualification of any merit is experience(sic),” the 67-year-old industrialist wrote.

నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్ర చమత్కార బదులు..

Posted: 06/27/2022 07:52 PM IST
Man asks anand mahindra about his qualification industrialist s epic reply wins internet

ప్రముఖ వ్యాపారదిగ్గజం.. మహీంద్రా గ్రూప్ ఆప్ కంపెనీస్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండారని తెలుసు. ఆయన తనదైనశైలిలో పలు వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకుంటారని కూడా తెలుసు. ఇందులో మనస్సును హత్తుకునేవి, మానవత్వంతో స్పందించేవి కూడా చాలనే ఉన్నాయి. అటో విడిభాగాలతో జీపును తయారు చేసిన వారికి బోలెరో వాహనాన్ని ఇవ్వడం కానీ.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కాళ్లు చేతులు లేని దివ్యాంగుడికి తన సంస్థలో ఉద్యోగం కల్పించడం ఇలా పలువురికి తన సంస్థ తరపున చేయగలిగినంత చేస్తారాయన.

అలాంటి ఈ పారిశ్రామిదిగ్గజానికి ఓ నెటిజన్ నుంచి ఎదురైన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలోనే బదులిచ్చారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తే ఆయన ఆనంద్ మహీంద్రా ఎందుకు అవుతారు.? అందుకనే ఆయన సమాధానం కూడా చమత్కారంగా.. ఇచ్చారు. తానడిగిన ప్రశ్నకు ఇలాంటి సమాధానం లభిస్తుందని బహుశా ఆ నెటిజన్ కూడా ఊహించిఉండకపోవచ్చు. వైభవ్ అనే నెటిజన్.. సర్... మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటూ ట్వీట్ చేశాడు. అందుకు ఆనంద్ మహీంద్రా స్పందించారు. "నిజం చెప్పాలంటే... నేనిప్పుడున్న వయసులో ఏ యోగ్యతకైనా అనుభవం మాత్రమే అర్హత" అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా సమాధానం అనేకమంది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అదే సమయంలో, ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ చర్చకు కారణం ఓ బాలిక ఫొటో. హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత ప్రాంతంలో ఓ గుట్టపై కూర్చుని చదువుకుంటున్న ఆ బాలిక ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభిషేక్ దూబే అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు. దానిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ఈ ఫొటో ఎంతో బాగుందని, ఆ బాలికను తాను ప్రేరణగా తీసుకుంటానని వెల్లడించారు. ఈ క్రమంలోనే వైభవ్ అనే నెటిజన్ ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles