Rahul Gandhi's Wayanad office vandalised, 8 SFI workers detained రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి.. విద్యార్ధుల చోరబడి ధ్వంసం

Rahul gandhi s wayanad office vandalised 8 sfi workers detained

wayanad, congress office, sfi activists, supreme court, eco-sensitive zone, rahul gandhi, kerala, supreme court, sc verdict, protests

The Students' Federation of India (SFI) took out a march and vandalised Congress MP Rahul Gandhi's office in Wayanad, Kerala. They barged into the office and destroyed pieces of equipment inside. The protest was carried out against Rahul Gandhi for allegedly not interfering in the Supreme Court order on the eco-sensitive zone (ESZ). After the protest, Congress stated that his office staff was also injured in the clash.

రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి.. విద్యార్ధుల చోరబడి ధ్వంసం

Posted: 06/24/2022 06:28 PM IST
Rahul gandhi s wayanad office vandalised 8 sfi workers detained

కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయానికి సుమారు 80 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు చేరుకుని బలవంతంగా లోనికి ప్రవేశించారని, సిబ్బందిని దారుణంగా కొట్టారని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ దాడికి కారణం ఏమిటో తమకు తెలియదన్నారు. బఫర్‌ జోన్‌ అంశంపై పోరాడుతున్నట్లుగా వారు చెప్పారని, అయితే దీనితో రాహుల్‌ గాంధీకి సంబంధం ఏమిటో అన్నది అర్థం కావడం లేదన్నారు.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళ సీఎం మాత్రమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతో ఈ అంశంపై జోక్యం చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌తోపాటు ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఎస్‌ఎఫ్‌ఐ యువకులు ఏ కారణంతో రాహుల్‌ కార్యాలయంపై దాడి చేశారో తమకు అర్థం కావడం లేదన్నారు. కాగా, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. అధికార సీపీఐ ప్రమేయంతోనే ముందస్తు కుట్రలో భాగంగానే రాహుల్‌ కార్యాలయంపై ఎస్‌ఎఫ్‌ఐ దాడి చేసిందని విమర్శించారు.

రాహుల్‌ గాంధీని ఈడీ గత ఐదు రోజులుగా ప్రశ్నిస్తుందని, ఇలాంటి తరుణంలో కేరళలోని అధికార సీపీఎం ప్రభుత్వం మోదీ మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తున్నదో తమకు అర్థం కావడం లేదన్నారు. సీతారామ్‌ ఏచూరీ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ సంఘటనకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో రాహుల్‌ గాంధీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలో భారీగా పోలీస్‌లను అక్కడ మోహరించారు. దాడి చేసిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles