హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి జలక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి.. కౌన్సిలర్ స్తాయికి మాత్రమే పరిమితమైనా.. ప్రజలతో మమేకం అయ్యానని గత ఎనమిదేళ్లుగా పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న మాజీమంత్రి స్వర్గీయ పి. జనార్థన్ రెడ్డి (పిజేఆర్) తనయ విజయారెడ్డి ఇవాళ అధికారపార్టీకి షాక్ ఇచ్చారు. తన తండ్రి పార్టీలోనే తాను ఇకపై కొనసాగతానని.. ఇకపై ఎత్తేది కాంగ్రెస్ జెండానేనని అమె తేల్చిచెప్పారు. ఇతర పార్టీల జెండాలను ఇక దించుడేనని అమె పేర్కోన్నారు. తాను ఇకపై తన తండ్రి బాటలోనే నడుస్తానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన తన తండ్రి.. ఆశయసాధనలో తాను నిమగ్నం అవుతానని అన్నారు. ఇవాళ తాను తిరిగి తన మాతృసంస్థ లాంటి కాంగ్రెస్ కు చోరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆమె జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గానూ కొనసాగుతున్నారు. అయితే టీఆర్ఎస్లో తనకు తగినంత మేర ప్రాధాన్యం దక్కడం లేదన్న భావనతో ఆమె చాలా కాలంగా మదనపడుతున్నట్లు సమాచారం. అదే సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయిన విజయారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఆమె ప్రతిపాదనకు అక్కడికక్కడే సమ్మతి తెలిపిన రేవంత్... విజయారెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాగా.. ఇవాళ అమె తన కార్యకర్తలతో లాంఛనంగా పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయారెడ్డి చేరికతో హైదరాబాదులో కాంగ్రెస్ మరింతగా బలోపేతం అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ కాంగ్రెస్ లో విజయారెడ్డి ఒక దళపతిలా పార్టీని, నాయకగణాన్ని ముందుకు నడుపుతారని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. పార్టీలోని సీనియర్ నేతలకు లభించే గౌరవమర్యాదలు విజయారెడ్డికి కూడా దక్కతాయని రేవంత్ ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చి చేరిన విజయారెడ్డికి కోమటిరెడ్డి ఘన స్వాగతం పలికారు. పీజేఆర్ కూతురు అయిన విజయారెడ్డి తమకు సోదరి అని పేర్కొన్న కోమటిరెడ్డి... ఖైరతాబాదే కాకుండా ఎక్కడ నిలుచున్నా విజయారెడ్డి ఎమ్మెల్యే అవుతారని చెప్పారు. విజయారెడ్డిని ఎమ్మెల్యేను చేసినప్పుడే పీజేఆర్‌కు అసలైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more