Dharmendra shares a video for fans amid hospitalization rumors అవి సత్యదూర వార్తలు.. నమ్మెద్దు: సినీనటుడు ధర్మేంద్ర

Dharmendra says chup hoon bimaar nahi as he dismisses hospitalisation rumours

Dharmendra, Dharmendra ill health, Dharmendra unwell, Dharmendra ill reports, Dharmendra ill rumours, Dharmendra rumours, Dharmendra reports, Dharmendra news, Dharmendra news today, Dharmendra today, bobby deol, sunny deol, Dharmendra latest, Dharmendra news

Veteran actor Dharmendra reassured his fans after reports about him being admitted to hospital began to do the rounds. In a new video, Dharmendra appears jovial and tells his fans to be positive and to ‘think positive’. He said that he was fine, and even quoted one of his songs.

ఆ వార్తల్లో నిజం లేదు.. అభిమానులు అందోళన చెందవద్దు: సీనియర్ నటుడు ధర్మేంద్ర

Posted: 06/07/2022 01:05 PM IST
Dharmendra says chup hoon bimaar nahi as he dismisses hospitalisation rumours

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరి పని వారు చేసుకోవడం మానేసి.. సెలబ్రిటీలు, ఇతర ప్రముఖ వ్యక్తుల గురించి వాకాబు చేయడం.. వారు ఆసుపత్రి పాలయ్యారని అసత్యవార్తలను తెరపైకి తీసుకురావడం ఈ మధ్యకాలంలో మరీ విపరీతం అయిపోయింది. అదే పనిగా పెట్టుకుని సైతం పలువురు ఈ పనులు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (86) విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఆయన కుటుంబసభ్యులు అసుపత్రులలో చేర్పించారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలను ధర్మేంద్ర కొట్టిపడేశారు. ఈ మేరకు ఆయన ఓ విడీయోను విడుదల చేశారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ పుకార్లు షికారు చేశాయి. దీంతో వాటిపై స్వయంగా ధర్మేంద్ర తన సామాజిక మాద్యమాల వేదికగా స్పందించారు. అటు ఇన్ స్టా్గ్రామ్, ఇటు ట్విట్ట్ర్ వేదికగా ఈ విడియోను విడుదల చేశారు. ఈ వీడియోలలో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఆ వీడియోలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను మౌనంగా ఉన్నాను తప్పితే అనారోగ్యంగా లేనని స్పష్టం చేశారు. ‘‘బి పాజిటివ్, థింక్ పాజిటివ్, లైఫ్ విల్ బి పాజిటివ్’’ అంటూ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు.

ఇతరులకు ప్రేమను పంచితే జీవితం అందంగా ఉంటుందన్న ధర్మేంద్ర.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆయన కుమారుడు బాబీడియోల్ కూడా ఖండించారు. కాగా, నెల రోజుల క్రితం ధర్మేంద్ర రొటీన్ చెకప్‌లో భాగంగా బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లారు. అప్పట్లో ఆయన ట్విట్టర్ ద్వారా తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లిందీ వెల్లడించారు. నడుం నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లానని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో స్పందించి వివరణ ఇచ్చారు.

భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత షోలే, చుప్కే చుప్కే, యాదోం కీ బారాత్, సత్యకామ్, సీతా ఔర్ గీతా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కరణ్ జొహార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహనీ’ సినిమాలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఇందులో జయాబచ్చన్, షబానీ ఆజ్మీ, అలియా భట్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles