TS TET hall ticket 2022; Here’s how to download తెలంగాణ టెట్ పరీక్షలు: హాల్ టికెట్లు విడుదల.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..

Ts tet hall ticket 2022 released steps to download admit card here

ssc result 2022 ts tet,tstet,ts tet hall ticket download 2022,ts tet hall ticket 2022,tstet.cgg.gov.in 2022,tstet cgg gov in,ts tet hall ticket download,tet hall ticket,inter results,tstet hall ticket 2022 download,intermediate result 2022,ts tet.cgg.gov.in,tet hall ticket download 2022 telangana,tet hall ticket 2022, tet,ts tet hall ticket,ts ssc results 2022,tet hall ticket 2022 download,ts tet.cgg.gov.in 2022,tstet.cgg.gov.in hall ticket,inter results 2022 date,tstet hall ticket download,tstet hall ticket download 2022,ts inter results,Telangana State Teacher Eligibility Test,TET 2022,TET 2022 Admit Card,TS TET,TS TET 2022 exam,tstet.cgg.gov.in

TS TET hall ticket 2022: The Department of School Education, Government of Telangana State has released the admit card for the Telangana State Teacher Eligibility Test, TET – 2022, today, June 06, 2022. Candidates who have registered for the recruitment exam can download their TET 2022 Admit Card through the official website, tstet.cgg.gov.in. The TS TET 2022 exam will be held on June 12 across 33 districts of the state.

తెలంగాణ టెట్ పరీక్షలు: హాల్ టికెట్లు విడుదల.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..

Posted: 06/07/2022 02:42 PM IST
Ts tet hall ticket 2022 released steps to download admit card here

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లయ్‌ చేసుకున్నారు. ఇక TS TET 2022 పరీక్ష జూన్ 12న జరగనుంది. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది.

ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈమేరకు మార్పులు చేసింది.

TS TET 2022 పరీక్ష తేదీ: 2022 జూన్ 12 (పేపర్ 1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది). కాగా టెట్ ఫలితాలను ఇదే నెలలో విడుదల చేయనున్నారు. పరీక్ష రాసీని పక్షం రోజుల తరువాత జూన్ 27న ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష జూన్‌ 12 న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. పేపర్‌-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్‌ -1 ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి 12 గంటలకు, పేపర్‌-2 పరీక్ష మద్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రెండు పేపర్లు రాసే అభ్యర్ధులు ఆయా సమయాల్లో పరీక్షకు హాజరుకావచ్చు.

కాగా ఈసారి రెండు పేపర్లకు హాజరయ్యేవారి సంఖ్య అధికంగా ఉంది. పేపర్‌ 1, పేపర్‌ 2లకు కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష అనంతరం ఫలితాలు జూన్ 27న వెల్లడవుతాయి. తెలంగాణలో 80,039 పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులున్నాయి. 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TET  Telangana teacher recruitment  TSTET  Teacher Eligibilty Test  admit card  Telangana  

Other Articles