Arvind Kejriwal's Minister Houses Raided By ED ఢిల్లీ అరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు.!

Ed searches delhi health minister satyendar jain in hawala transactions case

Satyendar Jain, arrest, enforcement directorate, money laundering case, AAP, Delhi Health Minister, Himachal Pradesh AAP Incharge, Himachal Pradesh assembly Elections, BJP plan to defeat AAP, Political rivalry, Crime

Delhi Health Minister Satyendar Jain house has been raided by the Enforcement Directorate (ED) in a money laundering case. Assets worth Rs 4.81 crore linked to the Aam Aadmi Party minister's family were attached by the ED in a disproportionate assets case in April this year.

మనీ లాండరింగ్ కేసులో.. ఢిల్లీ అరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు.!

Posted: 06/06/2022 10:13 AM IST
Ed searches delhi health minister satyendar jain in hawala transactions case

బీజేపియేతర రాష్ట్రాల్లోని మంత్రులను సైతం అరెస్టు చేయడం.. జాతీయ పార్టీ అగ్రనేతలకు శ్రీముఖాలను అందజేయడంలో కేంద్రంలోని స్వయంప్రతిపత్తి గల ఏజెన్సీలు తమ సత్తాను చాటుతున్నాయి. గత ఎనమిదేళ్ల కాలంలో పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులను అరెస్టు చేసిన కేంద్ర సంస్థలు.. మనీలాండరింగ్​ కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్​ను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎన్ ఫోర్సమెంట్ డేరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సాయంత్రం సత్యేంద్ర జైన్ ను అరెస్ట్​ చేయగా, సరిగ్గా వారం రోజులకు ఆయన ఇంటిపై మరోమారు అధికారులు దాడులు చేశారు.

2015-16 మధ్య కాలంలో కోల్​కతాలోని ఓ సంస్థతో సత్యేందర్​ జైన్​.. అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు మోపింది ఈడీ. ఈ అభియోగాల నేపథ్యంలో అయనను అరెస్టు వారం రోజుల క్రితమే అదుపులోకి తీసుకుంది కాగా, ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సోమవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్‌లోనే జప్తు చేసింది.

సత్యేంద్రజైన్ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. జూన్‌ 9 వరకు సత్యేంద్ర ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అయితే అప్ మాత్రం తమ మంత్రి అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది. తమను రాజకీయాంగా ఎదుర్కోనలేని బీజేపి కావాలని కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని పార్టీలను, ఆయా పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అరోపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గా అప్ తరపున వ్యవహరిస్తున్న సత్యేంద్రజైన్ ను రాజకీయాంగా ఎదుర్కోనలేక.. ఇలా అభియోగాలు మోపి అరెస్టు చేసి.. రాజకీయ లబ్దిని పోందాలని బీజేపి ప్రయత్నాలు చేస్తోందని అప్ పార్టీ అరోపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles