జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దారుణానికి తెగబడ్డారు. ఇలీవల కాశ్మీర్ పండిత్ ను తాను ఉద్యోగం చేస్తున్న కార్యాలయానికి వెళ్లి పాయింట్ బ్లాంక్ లో తుపాకీని గురిపెట్టి కాల్చిచంపిన ఘటనను మరువకముందే అలాంటి మరో ఘటనకు పాల్డడి.. తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. కాశ్మీర్ లో నివాసముంటున్న ఓ టీవీ నటిని కాల్చి చంపారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలో గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీ నటి అయిన అమ్రీన్ భట్ (35)ను ఉగ్రవాదలు కాల్పుల జరిపి హతమార్చారు.
పదేళ్ల వయసున్న తన మేనల్లుడితో కలిసి అమె తన ఇంటి బయట ఉన్న సమయంలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు. మెడలోంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అమ్రీన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అమ్రీన్ ప్రాణాలు కోల్పోయారు. ఫర్హాన్‌కు చికిత్స అందిస్తున్నారని, అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు.
అయితే అమ్రీన్ ను ఉగ్రవాదలు హతమార్చడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు కాశ్మీర్ కోర్టు జీవిత ఖైదు విధించిన క్రమంలో దానికి ప్రతీగానే అమ్రీన్ హత్య చేసినట్టు సమాచారం. కాగా, అమ్రీన్‌కు టిక్‌టాక్, యూట్యూబ్‌లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తుంటాయి. మరోవైపు, నిన్న బారాముల్లా జిల్లాలోని ఖేరీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా ఓ పోలీసు వీరమరణం పొందాడు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more