One chance CM giving no chance to live, says Lokesh లెక్చరర్ రామకృష్ణ మృతిపై టీడీపీ, జనసేన ఫైర్

Lecturer ramakrishnas is a govt murder alleges nara lokesh

Lecturer Ramakrishna, AP government:, AP Health dept, bike accident, Atmakur Govt Hospital, Duty Doctor, Timely Treatment, Nellore, Andhra Pradesh, crime

TDP general secretary Nara Lokesh said that the staff at Atmakur hospital played with the life of lecturer Ramakrishna. There was a duty doctor but the services of a sweeper and security guard were taken to treat the bike accident victim. Lokesh called the death of Ramakrishna a ‘Government murder’ as it happened because of the absence of services at the hospital.

లెక్చరర్ రామకృష్ణ మృతిపై నారా లోకేష్, నాదేండ్ల మ‌నోహ‌ర్ ఆగ్ర‌హం

Posted: 05/11/2022 07:19 PM IST
Lecturer ramakrishnas is a govt murder alleges nara lokesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రవిమ‌ర్శ‌లు గుప్పించారు. యాక్సిడెంట్‌లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ మృతి చెందిన విష‌యంపై స్పందించిన ఆయన ప్రజారోగ్య దేవుడిగా ప్ర‌చారం చేసుకుంటోన్న జ‌గ‌న్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా త‌యార‌య్యార‌ని విమ‌ర్శించారు. సకాలంలో ఆసుపత్రికి చేరినా.. అక్కడి సిబ్బంది చికిత్స చేయడంతోనే ఆయన మరణించారని అరోపించారు. లెక్చరర్ రామకృష్ణ మరణం ప్రభుత్వ హత్యగా ఆయన అరోపించారు. రాష్ట్రంలో వైద్యఅరోగ్యశాఖ ఎంత బాగా పనిచేస్తోందో ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తుదని అన్నారు.

మ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్..  గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చేరడమే శాపమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీ డాక్టర్ ఉండి కూడా ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు. వైద్యులు ఉండి కూడా చికిత్స చేయలేనంత తీరిక లేని పనులు ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన లెక్చరర్ కు స్వీపర్, సెక్యూరిటీ గార్డు చికిత్స చేయించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ఏపీలో జ‌గ‌న్ కి ప్ర‌జ‌లు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు.

కక్షసాధింపు చ‌ర్య‌లే ల‌క్ష్యంగా జగన్ ప్రభుత్వం ప‌నిచేస్తోంటే ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనాల‌ ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని చెప్పారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో అంతులేని నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. లెక్చరర్ రామకృష్ణ మృతి చెందిన‌ ఘ‌ట‌న‌పై నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రభుత్వ తీరుపై మండిప‌డ్డారు. వైద్యఆరోగ్య శాఖ‌ను నిర్వీర్యం చేసింది జ‌గ‌న్ సర్కారేన‌ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైద్యసేవ‌లు దిగ‌జారుతుండ‌డం వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాన్ని సూచిస్తోంద‌న్నారు.  

అసలేం జరిగిందీ..

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం జరిగిందీ. ఈ ప్రమాదంలో లెక్చరర్ రామకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో ఆయనను చికి్త్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, అసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఉన్నా.. ఆయన విశ్రాంతికి ప్రాముఖ్యత ఇవ్వడంతో.. రోడ్డు ప్రమాదంలోని క్షతగాత్రుడికి ఆసుపత్రిలోని సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడికి పరిస్థితిని పరిశీలించాల్సిన వైద్యుడు.. అసలు బాధితుడికి ఏం జరిగిందీ ఎక్కడెక్కడ గాయలయ్యాయి అన్న వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

సిబ్బంది స్వీపర్లు కట్టుకట్టిన తరువాత ఒక్క ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యుడు మళ్లీ వెళ్లి విశ్రాంతికే ప్రాధాన్యతనిచ్చాడు. దీంతో ఆ బాధితుడు మరణించాడు. అనంతసాగరం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి చిరంజీవి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ప్రైవేటు అసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా రామకృష్ణను పరిశీలించిన డ్యూటీ డాక్టర్.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే, రామకృష్ణకు మాత్రం డ్యూటీ డాక్టర్ చికిత్స చేయలేదు. కట్టు కట్టడం దగ్గర్నుంచి సెలైన్ బాటిళ్లు పెట్టేదాకా అంతా సెక్యూరిటీ గార్డులు, కాంపౌండర్లు, స్వీపర్లే చూసుకున్నారు.

ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో రామకృష్ణ కుటుంబసభ్యులు ఆయనను ప్రభుత్వ అసుపత్రి నుంచి నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా, ఈ ఘటనపై రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసుపత్రికి వెళ్తే ప్రాణాలు హరిస్తారా.? డాకర్లు విశ్రాంత్రి తీసుకోడానికే విధులకు హాజరవుతున్నారా.? లక్షల రూపాయల ప్రజాధానాన్ని జీతాలుగా ఎందుకు తీసుకుంటున్నారాని ప్రశ్నించారు. నర్సింగ్ సిబ్బంది ఎక్కడకు పోయారంటూ మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh