helicopter crashes at Raipur airport, 2 pilots dead ఛత్తీస్ గఢ్లో కుప్పకూలిన హెలికాప్టర్​.. ఇద్దరు పైలట్లు మృతి

Chopper crashes in chhattisgarh s raipur two pilots dead

Chhattisgarh helicopter crash, Raipur helicopter crash, helicopter crash, Raipur airport helicopter crash, raipur airport crash, Chhattisgarh chopper crash, Raipur chopper crash, helicopter crash, bhupesh baghel chopper crash, bhupesh baghel

A Chhattisgarh government helicopter crashed at Chhattisgarh’s Raipur airport resulting in the death of two pilots. Senior Superintendent of Police (SSP) Prashant Agrawal as saying that the accident occurred during a flying practice at the Swami Vivekananda Airport in Raipur at around 9:10 pm. The two pilots on board the helicopter — identified as Captain Gopal Krishna Panda and Captain A P Shrivastava — were seriously injured in the crash and taken to a nearby private hospital where they were declared dead.

ITEMVIDEOS: ఛత్తీస్ గఢ్లో కుప్పకూలిన హెలికాప్టర్​.. ఇద్దరు పైలట్లు మృతి

Posted: 05/13/2022 11:53 AM IST
Chopper crashes in chhattisgarh s raipur two pilots dead

ఛత్తీస్​గఢ్​ లో విషాదం చోటుచేసుకుంది. రాయ్​పూర్​లో రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఓ హెలికాప్టర్​ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్​పూర్​లోని స్వామి వివేకానంద ఎయిర్​పోర్టులో ఫ్లైయింగ్​ ప్రాక్టీస్​ జరుగుతోంది. ఈ క్రమంలో హెలికాప్టర్ వేసుకుని ప్రాక్టీసుకు వెళ్లివచ్చిన పైలెట్లు.. హెలికాప్టర్​ను ల్యాండ్​ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటల్లో పైలెట్లు ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.

కాగా వారిని అసుపత్రికి తరలించి చికిత్స అందించినా.. తీవ్ర గాయాల నేపథ్యంలో వారు చికిత్సకు స్పందించలేదు. దీంతో ఈ హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలెట్లు కెప్టెన్​ గోపాల్​ కృష్ణ పాండే, కెప్టెన్​ ఏపీ శ్రీవాత్సవ మరణించారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్​లో ప్రయాణికులు ఎవరు లేరు. కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనకు కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ (డైరక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​), ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం రంగంలోకి దిగాయి.

ఛాపర్ క్రాష్ లో ఇటీవల దేశ త్రివిధ దళాల అధినేత, బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 15 మంది మరణించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని కొకనూర్ లో జిరగిన ఈ ఘటన తరువాత మళ్లీ అలాంటి ఘటనే చత్తీస్ గడ్ లో సంభవించడం విషాధాన్ని నిపింది. ఈ ఘటనపై ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేష్​ భగేల్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన పైలట్లకు నివాళులర్పించారు. ఇదొక బాధాకరమైన సంఘటన అని, మృతుల కుటుంబాలకు దేవుడు శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్​ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles