Naxals Set Fire To A Private Bus In AP అల్లూరి జిల్లాలో బస్సును దహనం చేసిన నక్సల్స్‌

Naxals set torch a private bus in alluri district of andhra pradesh

Naxal torch private bus, Maoists tourch Private bus, Odisha to Hyderabad bound Private Travels bus, Private Bus, private bus set on fire, Maoists, Kothuru, Chinturu, Alluri Sitharama Raju District, East Godavari, Andhra Pradesh, Crime

An alert has been sounded up in former East Godavari District, with torching of a Private bus, allegedly by Maoists, in the Alluri Sitharama Raju District of Andhra Pradesh on Sunday night.

అల్లూరి జిల్లాలో బస్సును దహనం చేసిన నక్సల్స్‌

Posted: 04/25/2022 11:16 AM IST
Naxals set torch a private bus in alluri district of andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో మరోమారు మావోయిస్టులు తమ ఉనికి చాటుకున్నారు. అర్థరాత్రి వేళ అదమరచి నిద్రపోతున్న ఓ ప్రైవేటు బస్సులోని ప్రయాణికులను కిందకు దింపి నిప్పుపెట్టి దహనం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటనకు పాల్పడ్డారు మావోయిస్టులు. ఒడిశా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సును ఆపిన మావోలు.. ఆదమరచి నిద్రపోతున్న ప్రయాణికులను కిందకు దింపి నిప్పుపెట్టారు. అనంతరం ప్రయాణికులను అర్థరాత్రి వేళ అడవిలో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మావోయిస్టు నేత నర్మద క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. దీంతో అమె మృతికి సంతాప సూచకంగా మావోయిస్టులు దండకారణ్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తామిచ్చిన బంద్ పిలుకును పరిగణలోకి తీసుకోకుండా.. దండకారణ్యం మార్గంలో ఒడిశా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేటు బస్సును గమనించిన మావోలు బస్సును ఆపి దానికి నిప్పుపెట్టారు. కాగా డ్రైవర్ సమాచారంలో బస్సు యాజమాన్యం మరో వాహనంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.

మావోయిస్టు నర్మద స్వస్థలం కృష్ణా జిల్లా. అల్లూరి ఉషారాణి అలియాస్‌ నర్మద 1980లో మద్రాస్‌ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. అనంతరం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. 42ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నారు. 2019లో క్యాన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చిన నర్మదను పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles