bride and groom absconded on seeing the police పెళ్లి వేడకలోకి పోలీసుల ఎంట్రీ.. వధువుతో వరుడు పరార్.!

Seeing the police bride and groom absconded hiding in the feilds

Groom ran away, child marriage, child line agra, child marrige, minor girl, firozabad police, police stopped child marriage, Bride groom abscond, Naya Pura Thana Ambah, Morena, Madhya Pradesh, Karkauli village, Mansukhpura, Pinahat police station, Uttar Pradesh, agra crime, agra police, agra news, agra latest news, agra, Uttar Pradesh, Viral video

A marriage ceremony was going on on the night of 20 April in a village of Pinahat's police station Mansukhpura area. The procession came from village Naya Pura Thana Ambah in Morena district of Madhya Pradesh. During this, the police got information that the girl who is getting married is a minor. As soon as the information was received, the police reached the spot and stopped the marriage. Even before that, seeing the police coming, the bride and groom fled from there.

పెళ్లి వేడకలోకి పోలీసుల ఎంట్రీ.. వధువుతో వరుడు పరార్.!

Posted: 04/22/2022 10:14 PM IST
Seeing the police bride and groom absconded hiding in the feilds

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లో వధూవరులకు సంబంధించిన అంశాలతో పాటు వారి బంధవులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అలాంటిదే ఈ పెళ్లి కూడా. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వార్త కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక్కడ పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు, బందువులతో పాటు బరాత్ ఊరేగింపులో ఘనంగా మండపానికి చేరుకున్నాడు.

పెళ్లి కూతురు కూడా బంధు, మిత్రుల సమేతంగా మండపానికి చేరుకుంది. మరికొన్ని క్షణాల్లో కళ్యాణ కమనీయంగా సాగుతుంది అనగా ట్విస్ట్ ఏర్పడింది. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటలపై నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వరుడి తండ్రితో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న మన్సుఖ్‌పురాలోని కర్కౌలి గ్రామంలో పెళ్లికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశారు.

వరుడు బ్యాండ్‌ మేళంతో ఊరేగింపుగా బంధువులతో కలిసి వధువు ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో యువతి మైనర్‌ అంటూ గ్రామస్తుడు ఒకరు మన్సుఖ్‌పురా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్టేషన్‌ ఇన్‌చార్జి గిరీష్‌కుమార్‌ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసులను చూడగానే బంధువులంతా ఖంగుతిన్నారు. పోలీసులను చూసిన తర్వాత వధూవరులు భయపడి పీటల మీద నుంచి పొలాల వైపు పారిపోయారు. ఆ తర్వాత బంధువులు సైతం వివాహ వేదిక నుంచి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.

వరుడు మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని నయాపుర అంబాహ్‌ అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వరుడి తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. బాలిక వయసుకు సంబంధించిన పత్రాలతో రావాలని సూచించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మైనర్‌కు వివాహం జరిపించినట్లయితే నిందితులందరిపై చర్యలుంటాయని ఎస్‌హెచ్‌ఓ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరుడు గత 15 రోజుల కిందట పొరుగున ఉన్న బంధువులపై వేధింపులకు పాల్పడగా.. కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles