దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందన్న వార్త తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.2.12.1 వేరియంట్.. ఢిల్లీలో వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ వేరియంట్ వల్లే ఢిల్లీలో కొవిడ్ కేసులు దారుణంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న బీఏ.2 కన్నా దీని తీవ్రత ఎక్కువ అని, ప్రజల్లో ఎక్కువగా వ్యాపించే శక్తి దీనికి ఉన్నట్టు తెలుస్తోంది. బీఏ.2 కన్నా ఈ కొత్త వేరియంట్ డబ్లింగ్ రేటు 2.5రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు.
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా 1000కిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే దాదాపు 8 కొవిడ్ వేరియంట్లు ఢిల్లీలో ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిల్లో ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్లు కూడా ఉన్నాయి. కాగా ఈ ఎనిమిది వేరియంట్లలో ఒకదాని వల్లే కేసులు భారీ మొత్తంలో పెరుగుతున్నట్టు భావిస్తున్నారు. అందువల్ల దానిని కనుగొనే పనిలోపడ్డారు."ఢిల్లీలో కొత్త వేరియంట్ బయటకొచ్చినట్టు అనిపిస్తోంది. రోగుల నమూనాలను సీక్వెన్సింగ్ చేశాము, త్వరలో దీనిపై స్పష్టత లభిస్తుంది," అని ఐఎల్‌బీఎస్ డైరక్టర్ డా. ఎస్కే సారిన్ మీడియాకు వెల్లడించారు.
ఈ పరిణామాల మధ్య కొవిడ్ నాలుగో వేవ్ భయాలు ప్రజల్లో మొదలయ్యాయి. కొత్త వేరియంట్లు రాకపోతే నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వైద్యుల మాటలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త వేరియంట్ భయాల మధ్య దేశంలో కరోనా కేసులు భారీస్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,451మందికి వైరస్ సోకింది. క్రితం రోజుతో పోల్చుకుంటే ఇది ఎక్కువ. కొవిడ్‌కు 54మంది బలయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 05.శాతంగా ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more