Will approach SC: Rakesh Tikait on bail to ministers son కేంద్రమంత్రి తనయుడికి బెయిల్ పై ‘సుప్రీం’ను ఆశ్రయిస్తాం: టికాయిత్

Do people want second kim jong farmer leader s dig at bjp amid polls

supreme court, Allahabad High Court, Lakhimpur case, Lakhimpur violence, Samyukta Kisan Morcha (SKM), Farm Laws, Rakesh Tikait, Bharatiya Kisan Union, Farmers protest, Ashish Mishra, Union Minister Ajay Mishra, Uttar Pradesh, Crime

Farmer leader Rakesh Tikait said the Samyukta Kisan Morcha (SKM) will approach the Supreme Court over granting bail to the Lakhimpur Kheri key accused Ashish Mishra, the son of Union Minister Ajay Mishra, by the Allahabad High Court on February 10.

సమస్యలను పరిష్కరించే సీఎం కావాలా.? రెండవ కిమ్ కావాలా.?: రాకేష్ టికాయిత్

Posted: 02/15/2022 07:26 PM IST
Do people want second kim jong farmer leader s dig at bjp amid polls

ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై.. ప్రజారంజక పాలనను అందించే ముఖ్యమంత్రి కావాలో, లేక నియంతను తలపించేలాంటి రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో తేల్చుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయిత్ సూచించారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆయన తన వంతుగా ప్రచారం చేస్తూ.. రైతులు ఐక్యంగా పోరాటం చేయడమే కాదు.. ప్రజాతీర్పును ఇవ్వడంలోనూ కీలకంగా మారాలని సూచించారు. ఏడాది కాలం పాటు రైతులు నిరసనలు చేపట్టినా స్పందించని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ‘యూపీ ప్రజలు తమ ఓట్లను తెలివిగా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి ప్రజాప్రతినిధులు కావాలో.. రెండవ కిమ్ జాంగ్ ఉన్‌(ఉత్తర కొరియా అధినేత) కావాలో తేల్చుకోవాలని కోరుతున్నాం. ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం మనకు వద్ద’ని  టికాయిత్  అన్నారు. తన స్వస్థలమైన ముజఫర్‌నగర్‌లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గత వారం ఆయన మండిపడ్డారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు.

అభివృద్ధి గురించి మాట్లాడాలని పశ్చిమ యూపీ ప్రజలు కోరుకుంటున్నారని.. హిందూ, ముస్లిం, జిన్నా, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి ఓట్లు పడవని ఆయన సూచించారు. ముజఫర్ నగర్‌ హిందూ-ముస్లిం మ్యాచులకు స్టేడియం కాదని టికాయిత్ ట్వీట్‌ చేశారు. రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రజలుగా గుర్తించినవారికి మాత్రమే ప్రజా మద్దతు లభిస్తుందని.. ప్రజా సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని ఆయన అశాభావం వ్యక్తంచేశారు. ఇక లఖీంపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి తనయుడు ఆశీశ్ కు బెయిలుపై తాము సుప్రింకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles